చిరు సినిమాలో చేసే విషయమై క్లారిటీ ఇచ్చిన సల్మాన్

Surya Prakash   | Asianet News
Published : Dec 01, 2021, 08:34 PM IST
చిరు సినిమాలో చేసే  విషయమై క్లారిటీ ఇచ్చిన సల్మాన్

సారాంశం

ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ "బజరంగీ భాయిజాన్" నటుడు మాత్రం ఈ సినిమా గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు.

చిరంజీవి(Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’(God Father) చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్  సల్మాన్ ఖాన్(Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నారా లేదా అనే విషయంలో మీడియాలో చర్చ జరుగుతోంది. క్లారిటీ మాత్రం రావటం లేదు. కానీ తాజాగా ఈ విషయమై హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో  చేయించాలనుకున్నట్టు సమాచారం. 

ఇక  ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు.  ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా  Salman Khan ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ...తనని చిరంజీవి గారు తన చిత్రంలో చేయమని అడిగారని తను `యస్` చెప్పానని అని అన్నారు. దాంతో సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ సెట్ అయ్యినట్లు అయ్యింది.

ఇక  ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచినట్టు సమాచారం.  అందుకు చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

ఇదిలా  ఉండగా ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటించడం  దాదాపు ఖరారైనట్టు సమాచారం.  త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు.

also read: ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్