బ్రహ్మానందం ఆరోగ్యంపై కొడుకు క్లారిటీ!

Published : Jan 17, 2019, 04:03 PM IST
బ్రహ్మానందం ఆరోగ్యంపై కొడుకు క్లారిటీ!

సారాంశం

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ స్పందించాడు. బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ స్పందించాడు. బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగాఉందని చెప్పారు.

కొన్ని నెలలుగా ఛాతీలో అసౌకర్యంగా ఉందని అనిపించడంతో నాన్నగారికి హైదరాబాద్ లో డాక్టర్ కి చూపించామని ఆయన సలహా మేరకు గుండె ఆపరేషన్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో ఉత్తమమైన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సోమవారం నాడు గుండె ఆపరేషన్ జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసీయు నుండి సాధారణ గదికి మార్చారని చెప్పారు.

'నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. అందరి ప్రేమాభిమానాల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని' గౌతం తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మానందంతో పాటు ఆయన ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్ లు ముంబైలోనే ఉన్నారు.  

హాస్య నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ అతడు మూవీకి ఫస్ట్ ఛాయస్ ఎవరంటే.? తెలిస్తే షాకవుతారు..
Mana Shankara Vara Prasad Garu 3 Days Collections: బాలయ్య లైఫ్‌ టైమ్‌ వసూళ్లని మూడు రోజుల్లోనే లేపేసిన చిరు