KGF వర్సెస్ బాహుబలి... చితకొట్టేసింది!

Published : Jan 17, 2019, 03:22 PM IST
KGF వర్సెస్ బాహుబలి... చితకొట్టేసింది!

సారాంశం

సౌత్ సినిమాల స్థాయి ఎంతగా పెరుగుతుందో KGF సినిమా మరోసారి నిరూపించింది. బాహుబలి అనంతరం దేశవ్యాప్తంగా మంచి విజయం అందుకున్న చిత్రాల్లో ఒక కన్నడ సినిమా నిలవడం ఇదే మొదటిసారి. 

సౌత్ సినిమాల స్థాయి ఎంతగా పెరుగుతుందో KGF సినిమా మరోసారి నిరూపించింది. బాహుబలి అనంతరం దేశవ్యాప్తంగా మంచి విజయం అందుకున్న చిత్రాల్లో ఒక కన్నడ సినిమా నిలవడం ఇదే మొదటిసారి. KGF అందుకుంటున్న కలెక్షన్స్ కి బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డ్ బద్దలవుతోంది. 

వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కొన్ని ఏరియాల్లో బాహుబలి 2 రికార్డులను తాకుతుండడం విశేషం. కన్నడలో బాహుబలి 2 కలెక్షన్స్ ను అందుకోవడానికి ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. బాహుబలి 2 కర్ణాటకలో 129 కోట్లను వసూలు చేసింది. ఇక ఇప్పుడు అదే తరహాలో కేజిఎఫ్ 125 కోట్ల గ్రాస్ అందుకొని బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు సిద్దమయ్యింది. 

రివ్యూలు నెగిటివ్ గా వచ్చినప్పటికీ యష్ కి ఉన్న క్రేజ్ సినిమా స్థాయిని పెంచింది. రికార్డుల వసూళ్లతో క్రిటిక్స్ సైతం షాక్ ఇచ్చింది. నెక్స్ట్ ఛాప్టర్ 2 ని ఇంకా భారీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక హిందీలో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న KGF తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లను వసూలు చేసి బయ్యర్స్ కు మంచి లాభాలను ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే
BMW vs Anaganaga Oka Raju: రవితేజకి నవీన్‌ పొలిశెట్టి బిగ్‌ షాక్‌.. `అనగనగా ఒక రాజు`కి ఊహించని కలెక్షన్లు