అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిమానం.. వారితో ఢీకి సై

Published : Mar 20, 2024, 05:36 PM IST
అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిమానం.. వారితో ఢీకి సై

సారాంశం

అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు తెలుగులో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియాపై కన్నేశారు. అయితే వారిపై అభిమానం చాటుకున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. సేమ్‌ ఇమేజ్‌, సేమ్‌ ఫాలోయింగ్‌. నెక్ట్స్ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ ఇద్దరు తమ సినిమాలతో సత్తా చాటబోతున్నారు. అయితే వీరికి ఎంతో మంది అభిమానులుంటారు. వారిలో స్టార్స్ ఉంటే అది ప్రత్యేకమనే చెప్పొచ్చు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

తాజాగా వీరిపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిమానం చాటుకోవడం విశేషం. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌.. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లపై ఆయన తన అభిమానం చాటుకున్నారు. ఈ ఇద్దరు నటులకు తాను పెద్ద అభిమానిని అని తెలిపారు. వారి వర్క్ ని ఆయన ఇష్టపడతాడట. అంతేకాదు మున్ముందు వారితో కలిసి నటించాలని ఉందని తెలిపాడు. అయితే వారితో తలపడాలని ఉందని తన మనసులో మాట వెల్లడించారు. అంటే వారి సినిమాల్లో విలన్‌ రోల్‌కి సిద్ధమే అనే విషయాన్ని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుతం ఆయన `భడేమియా, చోటా మియా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ మరో హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు `సింఘం ఎగైన్‌`, `జగన్‌ శక్తి` సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఆగస్ట్ 15న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. నార్త్ మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు రెడీ అవుతుంది.

మరోవైపు ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుంది. దసరాకి రాబోతుంది. దీంతోపాటు హిందీలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌కి ప్రత్యర్థిగా ఆయన కనిపిస్తారట. అలాగే సోలో హీరోగా మరో సినిమా చేయబోతున్నారు తారక్‌.  

Read more: ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్ లో అల్లు అర్జున్, ఎందుకొచ్చారో తెలుసా..?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌