షాకింగ్ రేటుకు ‘గేమ్‌ ఛేంజర్‌’OTT రైట్స్, ఎవరికి , ఎంతకి

Published : Mar 20, 2024, 05:06 PM IST
 షాకింగ్ రేటుకు  ‘గేమ్‌ ఛేంజర్‌’OTT రైట్స్,  ఎవరికి , ఎంతకి

సారాంశం

ఓటిటి జెయింట్ Amazon Prime ఈ చిత్రం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ మొత్తం సొంతం చేసుకుంది. 


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్  పై ఏ రేంజి అంచనాలు ఉన్నాయో తెలిసిందే.   రామ్‌  చరణ్‌ క్రేజ్ కు తగ్గ మరో పాన్‌ ఇండియా చిత్రమిది.  రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ సైతం ఊపందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటిటి రైట్స్ లాక్ చేసారు. ఓటిటి జెయింట్ Amazon Prime ఈ చిత్రం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ మొత్తం సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రం మరో లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్  Zee5 వారు సొంతం చేసుకున్నారు. 

ఇక ఈ రైట్స్ నిమిత్తం అమేజాన్ వారు 105 కోట్లు పే చేసారని తెలుస్తోంది. జీ 5 ఎంత పే చేసారనేది మాత్రం తెలియరాలేదు. శంకర్, రామ్ చరణ్ కాంబో కావటంతో ఈ రేటు పలికింది. శంకర్ కు తమిళంలో ఉన్న మార్కెట్ ప్లస్ కానుంది. అలాగే రామ్ చరణ్ ..తన ఆర్ .ఆర్.ఆర్ చిత్రంతో హిందీలోనూ జెండా పాతారు. దాంతో అక్కడ మార్కెట్ కూడా యాడ్ అయ్యింది. ఈ క్రమంలో ఓటిటి ద్వారానే భారీగా నిర్మాత దిల్ రాజు రికవరీ తెచ్చుకోనున్నారు. 
  
ఇక  ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.   చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు.
 
రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.

 తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు
  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు