హరీష్ శంకర్ బాధ భరించలేకే ఆ డైలాగు చెప్పాను: పవన్ కళ్యాణ్

Published : Mar 20, 2024, 05:06 PM IST
హరీష్ శంకర్ బాధ భరించలేకే ఆ డైలాగు చెప్పాను: పవన్ కళ్యాణ్

సారాంశం

 గాజు గ్లాస్ పగలిన  డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో  వివరణ ఇచ్చారు పవన్.  జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ..

ఎవరూ ఊహించని విధంగా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి  గ్లింప్స్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.  ఈ గ్లింప్స్ లో పవన్ గాజు గ్లాస్ గురించి చెప్తూ.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ చెప్తారు. అయితే ఇది పొలిటికల్ కి ఉపయోగపడాలనే ఇపుడు ఈ గ్లింప్స్, ఆ గాజు డైలాగ్ తో రిలీజ్ చేసారని అందరూ అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే యాంగిల్ లో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో  ఈ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో  వివరణ ఇచ్చారు పవన్.  జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.

పవన్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు. ఈ రోజు వచ్చింది అనుకుంట గ్లింప్స్. ఆ గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకు రాసావ్ అని హరీష్ శంకర్ ని అడిగితే.. అందరూ మీరు ఓడిపోయారు, ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పదునెక్కుతుంది. మీకు తెలియదు మా లాంటి ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటారు అని అన్నాడు. నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను అని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

  గబ్బర్‌సింగ్‌ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు.  ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రోమో విడుదలైంది. దీనిని ఉద్దేశించి ఓ రాజకీయ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదన్నారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?