ఆదానీ, అంబానీలను మించిపోయిన అక్షయ్ కుమార్.. రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ హీరో..

Published : Aug 01, 2023, 08:24 PM IST
ఆదానీ, అంబానీలను మించిపోయిన అక్షయ్ కుమార్..  రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ హీరో..

సారాంశం

ఇండియాల్ అత్యంత ధనవంతులు ఎవరు అని చిన్న పిల్లాడిని అడిగినా.. అంబాని,ఆదానీల పేర్లు చెపుతారు. ఇండియాలో ఎక్కువ టాక్స్ కట్టేది కూడా వారే అయ్యింటారని అందరి అభిప్రాయం.. కాని దాన్ని పటాపంచలు చేస్తూ.. కొంత కాలంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. 

ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరి.. దేశంలో అత్యధిక సంపన్నులుగా పేరు పొందిన వారు ఎవరు అని అంటే.. మన ఇండియాలో చిన్న పిల్లాడు కూడా చెపుతాడు.. ఆదాని, అంబానీల పేర్లు. మన దేశంలో అత్యధిక  పన్ను చెల్లించేవారు కూడా వారే అనేది అందరి అభిప్రయాయం దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా... లాంటి వారు దేశంలో ఎక్కువగా ఇన్ కమ్ టాక్స్ కడుతున్నారు అనేది అందరి అభిప్రాయం. అయితే వారిని కూడా క్రాస్ చేస్తూ.. అత్యధిక పన్ను చడుతున్నా వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. 

ఈ ఏడాది  అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తి ఏ వ్యాపారవేత్తో కాదు.. బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్. ఇది అందరికి షాక్ ఇచ్చే విషయమే అయినా.. ఇది నిజంగా  నిజంఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం అక్షయ్ కుమార్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.29.5 కోట్ల పన్నును చెల్లించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.486 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు.

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిలో అక్షయ్ కుమార్ ముందున్నారు. ఆయన సినిమాకు దాదాపు వంద కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అంతేకాదు  ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు అక్షయ్. . దీంతో పాటు అతను తన ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ను నిర్వహిస్తున్నారు. అలాగే, ఆయా కంపెనీల ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అత్యధిక పన్ను చెల్లించి.. అందరికంటే ఆయన ముందు వరసలో ఉన్నారు. అక్షయ్ కుమార్ దాదాపు 25.5 కోట్ల పన్ను చెల్లించారు. 

అయితే ఈలిస్ట్ లో ముందు పేరుగా.. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాల పేర్లు రాకపోవడానికి కారణమూ ఉంది. వీరి ఆస్తులు ఎక్కువగా కంపెనీల పేరిట ఉంటాయి. ఆదాయాలు కూడా అధికం కంపెనీల వాటాగా  వెళతాయి. కాబట్టి వ్యక్తిగత అత్యదిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమారే గత కొన్నేళ్లుగా ముందు నిలుస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan Injury: రామ్‌ చరణ్‌కి దెబ్బ,పెద్ది సినిమా వాయిదా?.. అభిమానుల ఆందోళన
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2