షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘జవాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఒక్కరోజులోనే సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని సెన్సేషన్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చివరిగా ‘పఠాన్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు మళ్లీ యాక్షన్ ప్యాక్డ్స్ గా ‘జవాన్’ (Jawan) సినిమాతో షారుఖ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ (Atlee) డైరెక్ట్ చేస్తుండటం విశేషం. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
వచ్చే నెలలోనే రిలీజ్ ఉండటంతో సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను వదులుతున్నారు యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ‘జవాన్’ మొదటి పాట Zinda Bandaను విడుదల చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేశారు. కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని సాంగ్ సెన్సేషన్ గా మారింది. గతంలో షారుఖ్ ఖాన్ ‘లుంగీ డాన్స్’ తరహాలో ఈ పాట కూడా బ్లాక్ బాస్టర్ సాంగ్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది.
ఇక సాంగ్ వీడియో పరంగానూ ఆకట్టుకుంటోంది. షారుఖ్ ఖాన్ యంగ్ గానూ, స్టైలిష్ గానూ కనిపిస్తున్నారు. మరోవైపు షారూఖ్ 1,000 మందికి పైగా మహిళలతో డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అదిరిపోయే స్టెప్పులతో పాటు పోలీసు యూనిఫాంలో షారుఖ్ ఖాన్ కనిపించడం కూడా సాంగ్ కు గ్రాండ్ లుక్ ను తీసుకొచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ కు హిందీలో వాసిమ్ బరేల్వి సాహబ్ లిరిక్స్ అందించారు. తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. అనిరుధ్ రవిచంద్రన్, సింగర్ మంగ్లీ పాడారు. అనిరుధ్ మాస్ బీట్ ను అందించారు.
ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు నటిస్తున్నారు. విజయ్, సంజయ్ దత్, దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Taking the internet by storm! Thank you for all the love. ❤🔥
Song out now! https://t.co/yPmc6BrKWv releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/NdfXQr5eFu