కొడుకు పుట్టినరోజు ఎమోషనల్ అయిన మంచు మనోజ్!

Published : Aug 01, 2023, 06:24 PM IST
కొడుకు పుట్టినరోజు ఎమోషనల్ అయిన మంచు మనోజ్!

సారాంశం

కొడుకు ధైరవ్ పుట్టినరోజునాడు మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. తనను భగవాన్ శివుడు ఇచ్చిన బహుమతిగా అభివర్ణించాడు.   

మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. మౌనికకు కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో ఒక అబ్బాయి సంతానంగా ఉన్నాడు. పిల్లాడి పేరు ధైరవ్ నాగి రెడ్డి. వివాహమైన వెంటనే ధైరవ్ ని తన కొడుకుగా మనోజ్ ప్రకటించారు. తనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతిగా ధైరవ్ ని అభివర్ణించాడు. మౌనికతో పెళ్లయ్యాక ధైరవ్ మొదటి పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఒక సుదీర్ఘ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. 

ఈ  అపూర్వమైన రోజున లార్డ్ శివ ధైరవ్ నాగిరెడ్డి రూపంలో వెలకట్టలేని నిధిని బహుమతిగా ఇచ్చాడు. ధైరవ్ రాక ఒక సంఘటన కాదు, కొత్త ప్రయాణానికి నాంది. ఈ ప్రయాణంలో ప్రతిరోజును నేను ఆస్వాదిస్తున్నాను. నీ నవ్వులు, అమాయకత్వం, ప్రేమ నన్ను నడిపించే కాంతులు. అమ్మ,(మౌనిక), నీ ప్రేమ  నా జీవితాన్ని అందంగా మార్చేశాయి... అని సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. 

మనోజ్ కి ధైరవ్ అంటే ఎంత ప్రేమో ఆయన సందేశం తెలియజేస్తుంది. భూమా మౌనిక కుటుంబంతో మనోజ్ కి చాలా కాలంగా పరిచయం ఉంది. మౌనిక వివాహానికి మనోజ్ హాజరయ్యారు. అనంతరం మనోజ్, మౌనికలు తమ భాగస్వాములతో విడాకులు అయ్యాయి. అప్పుడు వీరిద్దరూ దగ్గరయ్యారు. మౌనికను దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డట్లు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర పాటు చెన్నైలో రహస్యంగా ఉన్నారట. 

కాగా మౌనికతో వివాహానికి మోహన్ బాబు ఒప్పుకోలేదనే ప్రచారం జరిగింది. దీనికి క్లారిటీ ఇస్తూ మనోజ్, నాన్నకు మౌనిక గురించి చెప్పినప్పుడు బాగా ఆలోచించావా అన్నాడు. ఆమె నన్నే నమ్ముకుంది. తనకు జీవితం ఇవ్వకపోతే బ్రతకం వేస్ట్ అని చెప్పినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. మనోజ్-మౌనిక పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నాడు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో హాజరయ్యారు. మంచు లక్ష్మి తమ్ముడు పెళ్లి బాధ్యత నెరవేర్చింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ