Bigg boss telusu 5: బిగ్ బాస్ లీక్... గుండెలు పిండేయనున్న ఈ వారం ఎలిమినేషన్, కన్నీరు ఆపుకోలేరు!

Published : Nov 26, 2021, 05:08 PM IST
Bigg boss telusu 5: బిగ్ బాస్ లీక్... గుండెలు పిండేయనున్న ఈ వారం ఎలిమినేషన్, కన్నీరు ఆపుకోలేరు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telusu 5) చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది దీంతో ఫైనల్ కి  వెళ్ళేది ఎవరు? టైటిల్ గెలిచేది ఎవరు? అనే ఆత్రుత అందరిలో మొదలైపోయింది. మరో వీకెండ్ దగ్గర పడగా హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరో ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. 

ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో రవి, సిరి, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్, సన్నీ, శ్రీరామ్ ఎలిమినేషన్స్ కి నామినేట్ కావడం జరిగింది. ఈ వారం కెప్టెన్ గా ఉన్న మానస్ ఎలిమినేషన్ నుండి ఉపశమనం పొందారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ లో చాలా ఎమోషనల్ డ్రామా చోటు చేసుకునే అవకాశం కలదు. ఎందుకంటే, హౌస్ లోని రెండు జంటల్లో ఒక జంట విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారం హిట్ లిస్ట్ లో ప్రియాంక, సిరి ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. 

ప్రియాంక మానస్ తో, సిరి షణ్ముఖ్ తో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారు. మానస్ కోసం ప్రియాంక ఏమి చేయడానికైనా సిద్ధం. హౌస్ లోకి వచ్చినప్పటి నుండి మానస్ కి బంకలా అతుక్కుంది ఈ ట్రాన్స్ జెండర్. మొదట్లో మానస్ ఆమెను పట్టించుకునేవాడు కాదు. రానురాను పరిస్థితి మారింది. మానస్ సైతం ఆమెకు దగ్గరయ్యాడు. అయితే ప్రియాంక ఇష్టపడుతున్నంత కాదు. గట్టిగా వద్దని చెబితే ఏమైనా చేసుకుంటుందేమోనని భయం వేస్తుందని మానస్ హోస్ట్ నాగార్జునతో అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. 

ఇంటిలో పెనవేసుకున్న మరొక ఘాడమైన బంధం సిరి, షణ్ముఖ్. హౌస్ కి రాకముందే మిత్రులైన వీరిద్దరూ.. ఎంటర్ అయ్యాక మరింత క్లోజ్ అయ్యారు. ముఖ్యంగా సిరి షణ్ముఖ్ కోసం ప్రాణం ఇచ్చేస్తుంది. ఎల్లవేళలా అతనితోనే ఉండాలని కోరుకుంటుంది. అతడు పలుమార్లు దూరం పెట్టినా, అతనితోనే ఉంటుంది. పేరుకు స్నేహితులం అంటారు కానీ హౌస్ లో వీళ్ళ రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది. 

Also read Bigg Boss Telugu 5: షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్.. వాళ్లిద్దరూ అలా ఉండడం నచ్చలేదు

మరి ప్రియాంక, సిరిలో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయం అని తెలుస్తుండగా... ఏడుపులతో కూడా పెద్ద ఎమోషనల్ డ్రామా ఆదివారం చోటుచేసుకోవడం ఖాయం. 

Also read Janani song : గుండెలు పిండేసే ఎమోషన్స్.... కన్నీరు ఆపుకోవడం కష్టమే!
 

PREV
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్