Janani song : గుండెలు పిండేసే ఎమోషన్స్.... కన్నీరు ఆపుకోవడం కష్టమే!

Published : Nov 26, 2021, 03:56 PM ISTUpdated : Nov 26, 2021, 04:04 PM IST
Janani song : గుండెలు పిండేసే ఎమోషన్స్....  కన్నీరు ఆపుకోవడం కష్టమే!

సారాంశం

ఓ బలమైన కథను  ప్రేక్షకుడితో పాటు ట్రావెల్ చేయించేది ఎమోషన్. ఆ మోషన్స్ ని ఒడిసి పట్టి తెరపై ఆవిష్కృతం చేయడంలో తాను దిట్ట అని రాజమౌళి  మరోమారు రుజువు చేశారు. నేడు విడుదలైన జనని సాంగ్... ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆత్మను పరిచయం చేసింది. 

ఓ బలమైన కథను  ప్రేక్షకుడితో పాటు ట్రావెల్ చేయించేది ఎమోషన్. ఆ మోషన్స్ ని ఒడిసి పట్టి తెరపై ఆవిష్కృతం చేయడంలో రాజమౌళి మరోమారు దిట్ట అనిపించారు. నేడు విడుదలైన జనని సాంగ్... ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆత్మను పరిచయం చేసింది. 

రెండు నిమిషాల జనని సాంగ్ (Janani song)... గుండెలను తాగింది. చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎన్టీఆర్ (NTR), చరణ్, అజయ్ దేవ్ గణ్, అలియా భట్, శ్రియాల ఎక్స్ప్రెషన్స్ కదిలించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ (Ram charan) ల నటన, ముఖంలోని భావాలు పీక్స్. ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ ఏ  స్థాయిలో ఉంటుందో.. అంతకు మించిన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయని రుజువైంది. జనని సాంగ్ వీడియో చిత్రంపై అంచనాలు ఇంకా పెంచేసింది. రాజమౌళి ఈ సాంగ్ గురించి చెప్పిన ప్రతిమాట నిజం అని సాంగ్ చూశాక అర్థం అయ్యింది. 


నిన్న రాజమౌళి (Rajamouli)మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో లెక్కకు మించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు హై అడ్రినలిన్ సీన్స్ ఉంటాయి. ప్రతి సన్నివేశానికి హార్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ మోషన్ ప్రతి సన్నివేశం తో పాటు అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది. 

Also read RRR movie: హార్ట్ ఆఫ్ ది ఆర్ ఆర్ ఆర్... జనని సాంగ్ చూడండి, సినిమా ఏమిటో తెలిసిపోతుంది... రాజమౌళి కామెంట్స్!

చివరికి నాటు నాటు లాంటి ఒక మాస్ బీట్ సాంగ్ లో కూడా నిగూఢంగా ఓ ఎమోషన్ గుండెల్లో క్యారీ అవుతుంది. ఈ అన్నీ ఎమోషన్స్ లోతుల్లోకి వెళ్లి తరచి తరచి చూస్తే, అక్కడ ఇంకా సాఫ్ట్ ఎమోషన్ ఒకటి ఉంటుంది.కంటికి కనపడని ఆ సాఫ్ట్ ఎమోషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోని యాక్షన్, ఎమోషనల్, ఉత్కంఠ రేపే అన్ని సన్నివేశాలను పట్టి ఉంచుతుంది. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుందని అన్నారు. 

ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో రాజమౌళి ప్రమోషన్స్ జోరు పెంచారు. డిసెంబర్ మొదటివారంలో ట్రైలర్ విడుదల ఉంటుందని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇక పలు భాషల్లో విడుదల అవుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం వివిధ ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ వేడుకలు ప్లాన్ చేస్తున్నారట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌