Shiva Shankar: శివశంకర్ మాస్టర్ కోసం వైద్యులతో మాట్లాడిన మంచు విష్ణు

pratap reddy   | Asianet News
Published : Nov 26, 2021, 03:21 PM IST
Shiva Shankar: శివశంకర్ మాస్టర్ కోసం వైద్యులతో మాట్లాడిన మంచు విష్ణు

సారాంశం

దక్షణాది భాషల్లో వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు శివశంకర్ మాస్టర్. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు.

దక్షణాది భాషల్లో వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు శివశంకర్ మాస్టర్. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు. రొమాంటిక్, విభిన్నమైన పాటలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ సౌత్ లో పాపులర్ అయ్యారు. ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం విషమించిందనే వార్త చిత్ర పరిశ్రమని ఆందోళనలోకి నెట్టింది. 

ఇటీవల శివశంకర్ మాస్టర్ కరోనా బారీన పడ్డారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో శివశంకర్ మాస్టర్ కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు 75 శాతం క్షీణించినట్లు తెలుస్తోంది. 

శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. దీనితో ఆయన చిన్న కుమారుడు వైద్య ఖర్చుల కోసం చిత్ర పరిశ్రమలో ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోనూసూ, హీరో ధనుష్ లాంటి వాళ్ళు శివశంకర్ మాస్టర్ వైద్యం కోసం ఆర్థిక సాయం చేశారు. 

ఇదిలా ఉండగా MAA అధ్యక్షుడు మంచు విష్ణు శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాను ఏఐజి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడినట్లు విష్ణు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడాను. మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరాను. అలాగే మాస్టర్ కుమారుడు అజయ్ కృష్ణతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పాను. మాస్టర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని మనమందరం ప్రార్థించాలి అని విష్ణు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

Also Read: 26/11 Mumbai attacks: సందీప్ ఉన్నికృష్ణన్ కి హీరో అడివి శేష్ నివాళి

బాహుబలి, మగధీర, మహాత్మ, అమ్మోరు, అరుంధతి లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. మగధీర చిత్రంలో 'ధీర ధీర' సాంగ్ కి కొరియోగ్రఫీ అందించింది శివశంకర్ మాస్టరే. ఆ పాటకు గాను శివశంకర్ మాస్టర్ కి నేషనల్ అవార్డు దక్కడం విశేషం.  

PREV
click me!

Recommended Stories

First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి
Mirchi Madhavi: ఐదుగురితో కాంప్రమైజ్ అయితే ప్రకాష్ రాజ్ భార్యగా ఛాన్స్, నీ సంగతి తెలుసులే అన్నారు