
బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) రసకందాయంలో పడింది. మరో నాలుగు రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఫైనలిస్ట్స్ గా సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ హౌస్ లో ఉన్నారు. మరి ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ నుండి ఎవరు టైటిల్ చేజిక్కించుకోనున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఫైనల్ ఎపిసోడ్స్ కావడంతో హౌస్ లో గేమ్స్, టాస్క్ కి బ్రేక్ పడింది. కంటెస్టెంట్స్ రిలాక్స్ అవుతున్నారు. గత రెండు ఎపిసోడ్స్ గా ఫైనల్ కి చేరిన వారి స్వీట్ మెమరీస్ గుర్తు చేస్తున్నాడు. బిగ్ బాస్ వాళ్ళ జర్నీకి సంబంధించిన ఏవీలు ప్రదర్శిస్తున్నారు.
హౌస్ లో గేమ్ చల్లబడగా బయట వేడెక్కింది. సోషల్ మీడియా వేదికగా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ హోరాహోరీగా తలపడుతున్నారు. సెలెబ్రిటీలు, బిగ్ బాస్ మాజీ పార్టిసిపెంట్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. సదరు కంటెస్టెంట్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా.. బిగ్ బాస్ షో ప్రచారం సాగుంది.
ఈ క్రమంలో తమ అభిమాన కంటెస్టెంట్ కి మద్దతుగా, నచ్చని కంటెస్టెంట్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సీజన్లో పాల్గొన్న యాంకర్ రవి కంటెస్టెంట్ శ్రీరామ్ (Sriram)కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రియాంక మానస్ కోసం క్యాంపైన్ నిర్వహిస్తుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఫ్యాన్స్ మరోవైపు భారీగా అతని కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక మానస్ విషయానికి వస్తే క్యాస్ట్ కార్డు తెరపైకి తెచ్చి, అతని విజయం కోసం ఓ వర్గం పనిచేస్తుంది.
Also read Bigg Boss Telugu 5: జర్నీ చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ.. షణ్ముఖ్‌ని బిగ్‌బాస్ ఏమన్నాడంటే?
మరోవైపు విన్నర్ ఎవరనే సర్వేలు, పోల్స్ నిర్వహణ ఎక్కువైపోయింది. అనేక మీడియా సంస్థలు బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఒక్కో సంస్థ ఫలితాలు ఒకలా ఉండడంతో టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ప్రధాన పోటీ అబ్బాయిల మధ్యే నడుస్తుంది. సిరి ఫైనల్ కి చేరినప్పటికీ ఆమె నామమాత్రమే అన్నట్లయ్యింది. షణ్ముఖ్ ఫ్యాన్స్ సప్పోర్ట్ చేయడం వలెనే ఆమె ఫైనల్ కి వరకు వచ్చారన్న వాదన ఒకటి ఉంది.
Also read పోలీసులను ఆశ్రయించిన `బిగ్‌బాస్5` ఫేమ్ యాంకర్ రవి.. అతడి కోసం ఆటో డ్రైవర్‌గా
అయితే సన్నీ, షణ్ముఖ్(Shanmukh), శ్రీరామ్, మానస్ ఎవరికి వారే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఎంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ టైటిల్ పోరులో నిలిచేది సన్నీ అని స్పష్టమైన సమాచారం అందుతుంది. విన్నర్ లేదా రన్నర్ గా సన్నీ (Sanny)నిలుస్తాడని పలు సర్వేల ఫలితాల ఆధారంగా తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీరామ్, షణ్ముఖ్ రేసులో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు, అంచనాలు మాత్రమే. చివరి ఫలితం వచ్చే వరకు ఏం జరుగుతుందో చెప్పలేం.