ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ ప్రకారం ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ 50 లక్షల నుండి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీన విడుదల కాబోతోన్న హాలీవుడ్ “స్పైడర్ మ్యాన్” సినిమా ప్రభావం హిందీలో ఎక్కువగా ఉన్నందున, ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణంగా ఉంటాయనేది సుమిత్ అంచనా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని రోజుల్లో సంచలన రికార్డులను నమోదు చేయడానికి బరిలోకి దిగుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓపినింగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. తెలుగు,తమిళ ప్రక్కన పెడితే హిందీ పరిస్దితి ఏమిటనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత బన్నీ క్రేజ్ బాలీవుడ్ కి పాకింది. నేషనల్ వైడ్ గా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆయన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయనకు క్రేజ్ పెరగడంతో ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమా హిందీ లో రిలీజ్ మొదట డౌట్ లో పడినా కానీ తిరిగి రేసు లోకి వచ్చి ఇప్పుడు సినిమా హిందీ లో 10 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది. హిందీ లో ఫస్ట్ అటెంప్ట్ తోనే ఈ రేంజ్ బిజినెస్ ను సాధించడం విశేషం అనే చెప్పాలి. అయితే అదే సయమంలో ప్రీ రిలీజ్ బుక్కింగ్స్ విషయానికి వస్తే బాగా డల్ గా ఉన్నాయని అంటున్నారు.
undefined
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ ప్రకారం ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ 50 లక్షల నుండి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీన విడుదల కాబోతోన్న హాలీవుడ్ “స్పైడర్ మ్యాన్” సినిమా ప్రభావం హిందీలో ఎక్కువగా ఉన్నందున, ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణంగా ఉంటాయనేది సుమిత్ అంచనా.
’s (Hindi) will certainly have a DUD opening in North India due to juggernaut.. Film hindi version could open in the range of ₹ 50 lakh- 1.5 cr nett.
— Sumit Kadel (@SumitkadeI)
సుమిత్ చెప్పింది నిజమైతే ‘పుష్ప’గా పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలనుకున్న అల్లు అర్జున్ ఆశలు అడియాశలు అయినట్లే. విడుదలకు ఇంకా పూర్తిగా రెండు రోజుల సమయం కూడా లేలు. ఇప్పటికీ, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో స్పీడుగా లేదు. ఈ నేపధ్యంలో హిందీ లో ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి అని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Also read Pushpa: బన్నీ పాన్ ఇండియా ఆశలపై నీళ్లు .. బిగ్ మార్కెట్‌ని లైట్ తీసుకున్న `పుష్ప` నిర్మాతలు?
మరో ప్రక్క పుష్ప ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదనే అభిప్రాయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా ఇన్ డైరెక్ట్ గా నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ”బన్నీ ఇది చాలా గొప్ప సినిమా. ముంబాయ్ లో పుష్ప గురించి అడుగుతున్నారు. నీవు అక్కడ కూడా దిన్ని ప్రమోట్ చేయాలి” అని చెప్పారు రాజమౌళి. పుష్ప కి పాన్ ఇండియా ప్రమోషన్ అవసరం అనే సంగతి రాజమౌళి గుర్తించారంటే .. పాన్ ఇండియా ప్రమోషన్ లో పుష్ప ఎంత స్లో గా వుందో అర్ధం చేసుకోవచ్చు.
Also read Pushpa:ప్రమోషన్స్ తగ్గించటం వెనక బన్ని షాకిచ్చే స్ట్రాటజీ