Balakrishna:అన్నింటికీ సిద్ధపడే అఖండ విడుదల చేశాం.. టికెట్స్ ధరల తగ్గింపు జీవో రద్దుపై బాలకృష్ణ స్పందన

By Sambi ReddyFirst Published Dec 15, 2021, 8:26 AM IST
Highlights


నేడు విజయవాడ ఇంద్రకీలాద్రికి బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో పాటు రావడం జరిగింది. బాలకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టికెట్స్ ధరల తగ్గింపు జీవో రద్దుపై కామెంట్స్ చేయడం జరిగింది. 

రెండు నెలలుగా టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి (AP Government)చిత్ర పరిశ్రమకు మధ్య సందిగ్ధత కొనసాగుతుంది. టికెట్స్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నం. 35 జారీ చేసింది. దీనిపై చిత్ర పరిశ్రమ పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇంత తక్కువ రేట్లతో సినిమా మనుగడ సాధించలేదని, ముఖ్యంగా పెద్ద చిత్రాల వసూళ్లపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని సినీ పెద్దలు వాదిస్తున్నారు. 

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని చిరంజీవి(Chiranjeevi), నిర్మాత సురేష్ బాబు, కె రాఘవేంద్రరావు విజ్ఞప్తి చేశారు. పలుమార్లు మంత్రి పేర్ని నానితో నిర్మాతలు దిల్ రాజు, డివివి దానయ్య వంటివారు భేటీ కావడం జరిగింది. ప్రభుత్వంతో పెద్దల చర్చలు ఫలించలేదు. పుష్ప నుండి రాధే శ్యామ్ వరకు నెల రోజుల వ్యవధిలో నాలుగు బడా చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. 

ఈ క్రమంలో బడా నిర్మాతలకు ఊరట కలిగిస్తూ... ఏపీ హైకోర్టు సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ జారీ చేసిన జీవో నం. 35ను రద్దు చేయడం జరిగింది. గతంలో ఉన్న టికెట్స్ ధరలు కొనసాగించాలని ఆదేశించడంతో పాటు, ధరలు పెంచి విక్రయించే వెసులుబాటును కూడా కల్పించింది. 

Also read Akhanda: హిందీ రీమేక్ కు అదే పెద్ద సమస్య అయ్యి కూర్చుంది

హై కోర్ట్ తీర్పుపై హీరో బాలకృష్ణ (Balakrishna) స్పందించారు. 'కోర్ట్ తీర్పు రాకుండానే అఖండ చిత్రాన్ని విడుదల చేశాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబసపరివార సమేతంగా థియేటర్లకు వస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని తెలియజేసిన చిత్రం అఖండ. దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తా. ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరల విషయంపై అఖండ విడుదలకు ముందు మేమంతా చర్చించాం. కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని బాలకృష్ణ  తెలిపారు. 

Also read MEGASTAR : మెగాస్టార్ కొత్త సినిమా ఫిక్స్... కుర్ర హీరోలకు షాకిస్తున్న చిరు.
నేడు విజయవాడ ఇంద్రకీలాద్రికి బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో పాటు రావడం జరిగింది. బాలకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టికెట్స్ ధరల తగ్గింపు జీవో రద్దుపై కామెంట్స్ చేయడం జరిగింది. అనంతరం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామిని అఖండ చిత్రబృందం దర్శించుకుంది.


 

click me!