
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే(Bigg boss telugu 5 grand finale) స్టార్ట్ అయిపోయింది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, మానస్ టైటిల్ కోసం పోటీపడుతుండగా మరికొన్ని గంటల్లో టైటిల్ అందుకునే ఆ కంటెస్టెంట్ ఎవరో తేలిపోనుంది. కాగా హౌస్ లో 14మంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక వాళ్ళ జర్నీ గురించి తెలియజేశారు. అలాగే ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు విజయం సాధించాలని వారు కోరుకుంటున్నారో తెలియజేశారు. మెజారిటీ కంటెస్టెంట్స్ సింగర్ శ్రీరామ్ గెలవాలని కోరుకోవడం విశేషం. 14 మంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లో యాంకర్ రవి, అన్నీ మాస్టర్, ప్రియా, హమీద, విశ్వ, లహరి, సరయు శ్రీరామ్ ని విన్నర్ గా చూడాలని ఉందని కోరుకున్నారు.
అదే సమయంలో నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ టైటిల్ గెలుచుకోవాలని కోరుకున్నారు. కేవలం జెస్సి, లోబో మాత్రమే షణ్ముఖ్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకున్నారు. మానస్ పేరును ఒక్క ప్రియాంక మాత్రమే సూచించారు. ప్రియాంక మరో రెండు పేర్లు సన్నీ, శ్రీరామ్ కూడా చెప్పడం విశేషం. సిరి టైటిల్ గెలవాలని ఒక్కరు కూడా కోరుకోలేదు.
బిగ్ బాస్ సీజన్ 5 లో మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వీరిలో 14 మంది ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక తమ ఎక్సపీరియెన్స్ తెలియజేశారు. సరయు హోస్ట్ నాగ్ ని డేట్ కి వెళదామని అడిగింది. లహరి.. ఐ లవ్ యు చెప్పడం విశేషంగా మారింది. ప్రియాంక తనకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయని, అందరూ తనలాంటి కూతురు పుట్టాలని కోరుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేసింది.
ఇక నటరాజ్ మాస్టర్ తనకు బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం దక్కిందని, అలాగే నటిస్తున్నాను అన్నారు. జెస్సీ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నట్లు పరిస్థితి ఉంది, నాకు బాగా వచ్చిందన్నారు. ఉమాదేవి మంచి పేరుతో బయటికి వెళ్ళాను. పిల్లలు అమ్మ నువ్వు గ్రేట్ అంటుంటే చాలా సంతోషం కలిగిందన్నారు.
Also read BIG BOSS5 RAJAMOULI: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది... రాజమౌళి షాకింగ్ కామెంట్స్