Spider Man 100 Crore : పుష్పకు గట్టిపోటీ ఇస్తోన్న స్పైడర్ మ్యాన్

Published : Dec 19, 2021, 06:16 PM IST
Spider Man 100 Crore :  పుష్పకు గట్టిపోటీ ఇస్తోన్న స్పైడర్ మ్యాన్

సారాంశం

పుష్పకు పోటీగా పరుగులు పెడుతుంది హాలీవుడ్ యాక్షన్ మూవీ స్పైడర్ మ్యాన్ . చిన్న పెద్ద  అంతా క్రేజీగా ఫీల్ అయ్యే ఈ మూవీ. ఇండియాలో భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. పుష్ప సినిమాకు గట్టిపోటీ ఇస్తోంది.

పుష్పకు గట్టిపోటీ ఇస్తోంది హాలీవుడ్‌ సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ మూవీ. చిన్నా.. పెద్ద అందరూ ఇష్టపడే స్పైడర్ మ్యాన్ మూవీ అన్ని సిరీస్ లు ఇండియాలో  సూపర్ హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన్ మరో సిరీస్ కు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. భారీ హైప్‌తో డిసెంబర్‌ 16న విడుదలైంది స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌. టామ్‌ హాలండ్‌  స్పైడర్ మ్యాన్ గా టైటిల్ రోల్ చేసిన ఈ మూవీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సక్సెస్ సాధించి కలెక్షన్ల వాన కురిపిస్తుంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే స్పైడీ  మూవీ.. ఇండియాలో 100 కోట్ల మార్కును దాటేసింది.

వర్కింగ్ డేస్ లోనే ఇలా ఉంటే.. ఈరోజు  ఆదివారం.. ఈరోజు స్పైడర్ మ్యాన్ ఇంకా భారీ వసూళ్లు రాబట్టనుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ఇండియాలో ఇప్పటి వరకు 100.84 కోట్లు సాధించింది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన 16 తేదీన 32 కోట్లు ఓపెనింగ్స్ సాధిచింది.  జాన్ వాట్స్‌ డైరెక్ట్ చేసిన ఈమూవీ వల్ల ఇండియన్ మార్కెట్ లో  పుష్ప కలెక్షన్స్ కు దెబ్బ తప్పడం లేదు.

 

ఈనెల 17న రిలీజ్ అయిన పుష్ప మూవీ ఫస్డ్ డే ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల వసూళ్ళు సాధించింది. సెకండ్ డే తో కలుపుకుని 116 కోట్ల వసూళ్ళు సాధించింది. స్పైడర్ మ్యాన్ ప్రభావం హిందీ మార్కెట్ పై ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా లేకుంటే హిందీ మార్కెట్ లో పుష్ప కలెక్షన్స్ ఇంకాస్త పెరిగేవి. అయినా సరే పుష్పకు హిందీ,కన్నడ,తమిళ మార్కెట్ నుంచి భారీగానే రెస్పాన్స్ వచ్చింది ఇక మలయాళంలో ఒక రోజు లేట్ గా రిలీజ్ అయినా.. గట్టిగానే ప్రభావం చూపించింది పుష్ప

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌