BiggBoss Telugu5 grand finale:నేను ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా.. బిగ్ బాస్ విన్నర్ సన్నీ

Published : Dec 20, 2021, 12:04 AM ISTUpdated : Dec 20, 2021, 12:05 AM IST
BiggBoss Telugu5 grand finale:నేను ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా.. బిగ్ బాస్ విన్నర్ సన్నీ

సారాంశం

విజయం అనంతరం సన్నీ (Sunny)ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అతడు హోస్ట్ నాగార్జునను గాలిలోకి ఎత్తారు. తనకు ఓట్లు వేసిన ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే గ్రాండ్(BiggBoss Telugu5 grand finale) గా ముగిసింది. ఈసారి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫైనల్ లో మెరిశారు. టాప్ స్టార్స్ రన్బీర్ కపూర్, అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)తో పాటు వేదిక పంచుకున్నారు. అలాగే పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. దర్శకుడు అయాన్ సైతం వీళ్ళతో జాయిన్ కావడం జరిగింది. 


అలాగే శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా... నాని, సాయి పల్లవి, కృతి శెట్టి వచ్చారు. వీరి అనంతరం పుష్ప(Pushpa) టీమ్ సుకుమార్, దేవిశ్రీ, రష్మిక మందాన బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ లిస్ట్ లో నాగ చైతన్య, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. ఇక ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో సన్నీ విజేతగా నిలిచాడు. ఫైనల్ కి చేరిన సిరి, మానస్, శ్రీరామ్ ఎలిమినేట్ కాగా.. టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్ పోటీపడ్డారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా సన్నీని బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నాగార్జున ప్రకటించారు. 

విజయం అనంతరం సన్నీ (Sunny)ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అతడు హోస్ట్ నాగార్జునను గాలిలోకి ఎత్తారు. తనకు ఓట్లు వేసిన ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి కారణమైన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అన్నాడు. ఇక తనతో పాటు ఈ సీజన్లో పాల్గొన్న వారిని 19 రత్నాలన్నారు సన్నీ. వారిలో నేను ఒకడిని, ఈ విజయంలో వాళ్ళ సహకారం ఎంతో ఉందని తెలియజేశారు. హౌస్ లో కొట్టుకున్నా, తిట్టుకున్నా.. వెంటనే ఒకటైపోయేవాళ్ళం, మేమందరం కలిసి ఉన్నామని ప్రామిస్ చేసుకున్నాం అన్నాడు. 

తల్లిదండ్రులను వేదికపైకి పిలిచిన సన్నీ.. అమ్మ కళావతిని పొగడ్తలతో ముంచెత్తాడు. తన విజయంలో ఆమె పాత్ర ఎంతగానో ఉందని తెలియజేశారు. మా అమ్మ అడిగిన ఒక్కగానొక్క కోరిక బిగ్ బాస్ టైటిల్, ఆమె కోరిక తీర్చాను అన్నాడు. నిర్వాహకుల కోరిక మేరకు ఆమె చేతుల మీదుగా టైటిల్ అందుకున్నాడు. 

Also read BiggBoss Telugu5 grand finale:సన్నీని కోటీశ్వరుడిని చేసిన బిగ్ బాస్ షో.. విన్నర్ గా అతడికి దక్కింది ఎంతంటే!

చివర్లో రన్నర్ షణ్ముఖ్ పై ప్రసంశలు కురిపించాడు సన్నీ. హౌస్ లో ఉన్న కూలెస్ట్ పర్సన్ షణ్ముఖ్ అన్నాడు. అదే సమయంలో సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై ఉన్న పుకార్లను తొలగించే ప్రయత్నం చేశాడు. సిరి, షణ్ముఖ్ లది గొప్ప స్నేహం, అలాంటి స్నేహం దొరకడం అదృష్టం అన్నాడు. షణ్ముఖ్ ని హగ్ చేసుకొని కృతజ్ఞతా భావం తెలియజేశారు. అలా సన్నీ విజయానంతరం తన ఫీలింగ్స్ తెలియజేశాడు. 

Also read Bigg Boss 5 Winner Sunny: బిగ్ బాస్ 5 విజేతగా అవతరించిన సన్నీ

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌