Bigg Boss fame Manas: ఫ్యాన్స్ కోరిక మేరకు బిగ్ బాస్ మానస్ అలా దర్శనమిచ్చాడు..!

Published : Jan 04, 2022, 05:17 PM IST
Bigg Boss fame Manas: ఫ్యాన్స్ కోరిక మేరకు బిగ్ బాస్ మానస్ అలా దర్శనమిచ్చాడు..!

సారాంశం

ఫ్యాన్స్ కోరిక మేరకు మానస్ ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ క్లిక్స్ షేర్ చేశారు. తన ఆఫీస్ లో కూర్చొన్న మానస్ జెంటిల్ లుక్ లో అదరగొట్టాడు. సదరు ఫోటోల క్రింద అసలు విషయం తెలియజేశారు. 

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మానస్ ఫైనల్ కి చేరాడు. ఈ యువ హీరో ప్రేక్షకులను తనదైన గేమ్ తో అలరించారు. ప్రారంభ ఎపిసోడ్స్ లో కూల్ గా ఉన్న మానస్... తర్వాత తనలోని తెగువ బయటకు తీశారు. ఒకదశలో టైటిల్ ఫేవరేట్ గా ఓటింగ్ లో దూసుకు వచ్చాడు. ఇక టైటిల్ గెలవలేకపోయినా ఫ్యాన్స్ ని మాత్రం సంపాదించుకున్నాడు. ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక మానస్ ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడో? తెలుసుకోవాలని అని ఫ్యాన్స్ ఆరాట పడుతున్నారట. అలాగే తన లేటెస్ట్ ఫోటోలు పంపించాలని సందేశాలు కూడా పంపుతున్నారట. 

ఫ్యాన్స్ కోరిక మేరకు మానస్ ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ క్లిక్స్ షేర్ చేశారు. తన ఆఫీస్ లో కూర్చొన్న మానస్ జెంటిల్ లుక్ లో అదరగొట్టాడు. సదరు ఫోటోల క్రింద అసలు విషయం తెలియజేశారు. చాలా మంది కోరిక మేరకు ఈ ఫోటోలు పంచుకున్నట్లు తెలియజేశాడు. ఇక మానస్ (Manas) ఫోటోలు చూసిన ఫ్యాన్స్ హ్యాండ్సమ్, మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా హౌస్ లో మానస్-ప్రియాంక (Priyanka) చాలా సన్నిహితంగా మెలిగారు. ఫైనల్ కి రెండు వారాల ముందు ఎలిమినేటైన ప్రియాంక మానస్ కోసం బయట క్యాంపైన్ చేశారు. మానస్ కి ఓటేసి గెలిపించాలని కోరుకున్నారు. హౌస్ లో మానస్-ప్రియాంక రిలేషన్ ఆడియన్స్ కి సూపర్ మజా పంచింది. ఎప్పుడూ మానస్ చుట్టూ తిరిగే ప్రియాంక అతనికి సేవలు చేస్తూ ఉండేది. గేమ్స్, టాస్క్స్ లో కూడా మానస్ కి ఫేవర్ గా ప్రవర్తించేది. మరి హౌస్ నుండి బయటికి వచ్చాక వీళ్ళ రిలేషన్ ఎలా ఉందనేది తెలియదు. 

Also read Deepthi-Shanmukh Breakup Effect: సిరి-శ్రీహాన్‌ ల కొంప ముంచుతుందా?.. నెట్టింట ఊపందుకున్న రూమర్స్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన మానస్.. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా చేశారు. ప్రస్తుతం ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసే ఆలోచనలో మానస్ ఉన్నట్లు సమాచారం. హౌస్ లో కూడా అదే తన డ్రీం గా తెలియజేశాడు. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా టాలెంట్ ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలని అనుకుంటున్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ 4వ స్థానం దక్కించుకున్నాడు. సిరి ఎలిమినేషన్ అనంతరం మానస్ ఎలిమినేట్ అయ్యారు. ఈ దశలో నమ్మకం లేనివారు ఒకరు బాక్సులో ఉన్న డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తిప్పుకోవచ్చని నాగార్జున సలహా ఇచ్చారు. అయితే మానస్ ఈ ఆఫర్ తీసుకోలేదు. ఒక వేళ ఒప్పుకొని ఉంటే 4వ స్థానంతో పాటు మానస్ కి కొంత డబ్బు దక్కేవి. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే