
అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేది. కరోనా భూతం ఆర్ ఆర్ ఆర్ ని మరోసారి వెంటాడింది. ఏకంగా నాలుగోసారి వాయిదా వేసేలా చేసింది. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ఫోన్ చేస్తున్నట్లు జనవరి 1న యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ఆర్ ఆర్ ఆర్ కారణం సంక్రాంతి బరి నుండి తప్పుకున్న చిత్ర నిర్మాతలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారు. రాజమౌళి (Rajamouli)వాయిదా నిర్ణయంపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే నటుడిగా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న మాధవన్ ఆర్ ఆర్ ఆర్ మూవీని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన 'నాటు నాటు' సాంగ్ లో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ గ్రేస్, ఎనర్జీ, కో ఆర్డినేషన్ పై పొగడ్తలు కురిపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను చూస్తుంటే ఈ ఈర్ష్యగా ఉందంటూ... ఆ ఇద్దరు హీరోల పట్ల అభిమానం, ప్రేమ చాటుకున్నారు.
ఇక మాధవన్ స్పందనకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. సదరు ట్వీట్ కోట్ చేసిన మాధవన్... ఆర్ ఆర్ ఆర్ టీమ్ చించేయనున్నారు. కలెక్షన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నారు అంటూ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఆర్ ఆర్ ఆర్ టీమ్.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం. దేశంలో ఏర్పడిన థియేటర్స్ సమస్యలు త్వరలో తీరిపోతాయని భావిస్తున్నామని కామెంట్ చేశారు. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్ ఆర్ ఆర్ అద్భుతమైన చిత్రం అంటూ మాధవన్ ట్వీట్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీపై మాధవన్ చేసిన వరుస ట్వీట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రమోషన్స్ కోసమే ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తీరా విడుదల సమయానికి థియేటర్స్ బంద్, యాభై శాతం ఆక్యుపెన్సీ వంటి సమస్యలు ఎదురయ్యాయి. అతికష్టం మీద మనసుకు ఇష్టం లేకపోయినా రాజమౌళి వాయిదా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఎన్టీఆర్ మూడు సంవత్సరాలు ఆర్ ఆర్ ఆర్ కోసం కేటాయించారు. రామ్ చరణ్ సైతం ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఈ పోస్ట్పోన్మెంట్ ఎన్టీఆర్, చరణ్ (Ram Charan)లను తీవ్ర మానసిక వేదనకు గురి చేసినట్లు సమాచారం.
Also read RRR:ఎన్టీఆర్, రామ్ చరణ్ బాగా డిప్రెస్ అయ్యారా ? సాక్ష్యం ఇదే??
కేవలం ఓపెనింగ్స్ ద్వారానే ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ వసూళ్లకు దగ్గరైంది. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్స్ దాటివేశాయి. భారీ హైప్ ని క్యాష్ చేసుకుందామనుకుంటున్న తరుణంలో ఇలా జరిగింది. భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. మరిన్ని కరోనా కేసులు పెరిగితే కనీసం కొన్ని నెలల పాటు లాక్ డౌన్ ప్రకటించవచ్చు. ఇన్ని సమస్యలు, సందేహాలు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ మెదళ్ళు తొలిచేస్తున్నాయి.
Also read RRR:'ఆర్ ఆర్ ఆర్'ఈవెంట్స్ కు జనం సప్లైకు అంత ఖర్చా? షాకింగ్