Acharya Song : ఆచార్య దూకుడు...రచ్చ రచ్చ చేస్తున్న సాంగ్

By Mahesh JujjuriFirst Published Jan 4, 2022, 2:09 PM IST
Highlights

ఆచార్య మూవీ అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు భారీ స్థాయిలో స్పందన వస్తుంది. మెగా ఫ్యాన్స్ అదరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు.      

 

చిరంజీవి,రామ్ చరణ్ కలిసి కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు గా నటించిన ఈ మూవీకి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. పిబ్రవరి 4న రిలీజ్ కాబోతున్న ఈసినిమా నుంచి వరుస అప్ డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు ఆచార్య టీమ్. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఆచార్య ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

 

ఇప్పటికే ఆచార్య నుంచి వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. స్పెషల్ లుక్స్.. అండ్ టీజర్స్ మాట సరేసరి. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి రీసెంట్ గా ఓ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. రెజీనా కసాండ్ర  జంటగా మెగాస్టార్ మాస్ బీట్ కు మస్త్ జబర్ధస్త్ స్టెప్పులు వేశారు. శానా కష్టం వచ్చిందే మందాకీని అంటూ సాగే పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు టీమ్. భాస్కర భట్ల రాసిన  ఈపాటకు మణిశర్మ ట్యూన్ చేయగా..ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. 

Also Read : Balakrishna: బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడంటే..? షూటింగ్ కు బాలయ్య రెడీ

ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. రిలీజ్ అయిన అప్పటి నుంచి ఒక రోజు లోపే.. దాదాపు  90 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది మెగా సాంగ్. అంతే కాదు రెండు లక్షలకు పైగా లైక్స్ ను సాధించింది సాంగ్. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది సాంగ్. అందులోను రెజీనా ఈ సాంగ్ చేయడంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే మెగాస్టార్ చిరంజీవితో అవకాశం రావడం వల్ల.. ఈ సాంగ్ చేశానని.. ఇక మీదట ఇలాంటి సాంగ్స్ చేయనని చెప్పేసింది రెజీనా కసాండ్ర.                                                 

click me!