
ఎన్టీఆర్ జోస్ట్ చేస్తున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా 59వరోజు ‘నా మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయాలని ఏ సమయంలో,ఎక్కడ,ఎలాంటి పరిస్థితులల్లో ఉన్నా రూల్స్‌ని అతిక్రమించ కూడదని... స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటి అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు వాటిని విధిగా పాటించాలన్నారు. ఈ టాస్క్ మొదట్లో చాలా ఫన్నీగా జరిగింది. ఫ్రీజ్, స్లోమోషన్, ఫార్వర్డ్,రివైండ్ సంకేతాలను కంటెస్టెంట్స్ పాటిస్తూ హౌస్‌లో నవ్వులు పూయించారు. శివబాలాజీ బట్టలు మార్చుకుంటుంటే ఫ్రీజ్‌లో ఉంచేయడం ఆ సందర్భంలో హరితేజ ఆటపట్టించడం, అర్చన మేకప్ వేసుకుంటుంటే ఫ్రీజ్‌లో ఉంచడం ఆ టైంలో నవదీప్ ఆమెకు జోకర్ మేకప్ వేయడం లాంటివి ఫన్నీగా సాగాయి.
అయితే గేమ్‌ను మరింత రక్తికట్టించేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీలను రంగంలోకి దింపారు. మొదటిగా శివబాలాజీ భార్య స్వప్న మాధురి(మధుమిత) హౌస్‌కి రాగా.. టైమ్ చూసి మరీ శివబాలాజీని ఫ్రీజ్ మోడ్ లో పెట్టి.. ఆమెతో తన ఫీలింగ్‌ని పంచుకోకుండా చేశారు బిగ్‌బాస్. ఇక 58 రోజులు భార్యకు దూరంగా ఉన్న శివబాలాజీ ఆమెను చూడగానే హగ్ చేసుకోకుండా ఉండలేకపోయాడు. తన భార్య ఐ లవ్ యు చెప్తుండగా గుండెలకు హద్దుకున్నాడు. భార్యభర్తలిద్దరూ కుశలప్రశ్నలు వేసుకుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు. బిగ్‌బాస్ షో గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, నాకు కోపం ఎక్కువనే టాక్ వచ్చేసిందా? అని శివబాలాజీ అడిగాడు.
సమాధానంగా షో దూసుకుపోతుందని టైటిల్ విన్నర్ రేస్‌లో ఎక్కువగా నీ పేరే వినిపిస్తుందని ఇలాగే కంటిన్యూ చేయమని శివబాలాజీ భార్య మధు తనకు సలహా ఇచ్చింది. ఇక ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లాలని, సమయం అయిపోయిందని ఆదేశించడంతో.. ఇంకో రెండు వారాల్లో వచ్చేస్తా అని శివబాలాజీ ధైర్యం చెప్పడంతో భారంగానే హౌస్‌ను వీడింది స్వప్న మాధురి.
ఆ తర్వాత ఆదర్శ్ భార్య గుల్నార్ హౌస్‌కి ఎంట్రీ ఇచ్చింది. తన భార్యను చూడగానే కన్నీళ్లు ఆపుకోలేక ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్న ఆదర్శ్‌కు ఫ్రీజ్‌లో ఉండాలని అనౌన్స్‌మెంట్ రావడంతో గేమ్ అతిక్రమించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఈ కదల్లేని స్థితి నుండి ఎప్పుడు విముక్తి వస్తుందా తన భార్యతో మాట్లాడదామా అని ఎదురు చూసిన ఆదర్శ్ కు షాక్ ఇస్తూ... ఆదర్శ్ భార్య గుల్నార్‌ను హౌస్ నుండి భయటకు రావల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. అయితే ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ గేమ్ రూల్స్‌ని అతిక్రమించకుండా దుఖాన్ని దిగమింగుకుని ఆదర్శ్ గేమ్‌ని కంటిన్యూ చేశాడు.
ఇక గుల్నార్ బిగ్ బాస్ హౌస్‌నుండి బయటకు వెళ్లిన తరువాత ఆదర్శ్‌కు ఫ్రీజ్ నుండి విముక్తినిస్తూ కన్ఫ్యూజన్ రూంకి వెళ్లాల్సిందింగా ఆదేశించారు బిగ్‌బాస్. అక్కడకు వెళ్లిన ఆదర్శ్‌కు గుల్నార్ ఆమె ముద్దుల కొడుకు దర్శనం ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఒక్కసారిగా భార్య పిల్లల్ని చూసిన ఆదర్శ్ తన ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. తన భార్య, కొడుకుని కౌగిలించుకుని ఏడ్చేశాడు. ఈ సీన్ హౌస్‌మేట్స్‌నే కాకుండా ప్రేక్షకులతో కూడా కంటతడి పెట్టించింది. ఇక ఆదర్శ్ తన భార్య కొడుకుని హౌస్ మేట్స్‌కి చూపిస్తూ ఆనందంతో పొంగిపోయాడు ఆదర్శ్. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో అర్చన, దీక్ష, హరితేజ, నవదీప్ కుటుంబ సభ్యులు హౌస్‌కి రానుండటంతో ‘ నా మాటే శాసనం’ టాస్క్ మరింత ఆసక్తిగా సాగనుంది.