
‘అర్జున్ రెడ్డి’ ప్రియురాలు నెల్లూరులో అస్వస్థతకు లోనయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రియురాలిగా నటించి పాపులర్ అయిన షాలిని పాండే ఇక్కడ ఒక ప్రోగ్రాం పాల్గొంటు మధ్య లో కిందపడటంతో అంతా ఆందోళన చెందారు. వెంటనే అమెను అక్కడి బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేశారు. ఆమె బుధవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు . ఉదయం 10 గంటలకు ఒక మొబైల్ షోరూం ఓపెనింగ్ లో పాల్గొనేందుకు వచ్చారు. షోరూంప్రారంభించారు. ఆ తర్వాత లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది. ఇది నడస్తుండగా షాలినీ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ప్రాథమిక చికిత్స తర్వాత ప్రమాదమేమీ లేదని బొల్లినేేని డాక్టర్లు చెప్పారు. అయితే, ఆమెను హైదరాబాద్ కు చికిత్సకోసంపంపించారు.