‘జై లవ కుశ’ ఫస్ట్ కాపీ రెడీ

Published : Sep 13, 2017, 01:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
‘జై లవ కుశ’ ఫస్ట్ కాపీ  రెడీ

సారాంశం

జై లవ కుశ సెన్సార్ పూర్తి సినిమాకి యూ/ఏ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కళ్యాణ్ రామ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదాథామస్ లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్లు.. సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

 

ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందట. 155 నిమిషాల నిడివి గల ‘జై లవ కుశ’ సినిమా ను సెన్సార్ బోర్డ్ కు కూడా పంపించేశారట.. వారు దానిని వీక్షించి మూవీకి యూ/ఏ  సర్టిఫికేట్ జారీ చేశారు.  ఇక సినిమాలో మూడు పాత్రల్లోనూ తన నట విశ్వరూపం చూపించేశారు. పాటలు కూడా అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

 

అయితే.. సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా ఆ పాటలో నర్తించగా.. దానిని చిత్ర బృందం సస్పెన్స్ గా ఉంచింది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామన్న చిత్ర బృందం.. సినిమా ఫలితం గురించి కాకుండా. ఎంత మేరకు జనాల్లోకి తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నారట. అందుకే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా ఈ సినిమా అన్నదమ్ములందరీ అంకితమిస్తున్నాన్నాడు తారక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఈ నెల 21 వరకు ఆగాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: అల్లు అర్జున్, చిరంజీవి ఇద్దరికి ఫేవరెట్ హీరోయిన్, మామ,అల్లుడు డ్యాన్స్ చేయాలని మనసుపడ్డ బ్యూటీ ఎవరో తెలుసా?
Bold Movies: చెమటలు పట్టించే సీన్స్ తో.. ఆడియన్స్ ను షాక్‌కు గురిచేసిన బోల్డ్ సినిమాలు ఇవే!