భోళా శంకర్: తమన్నా నిరాశ చెందిన విషయం అదే!

Published : Nov 12, 2021, 11:52 AM IST
భోళా శంకర్: తమన్నా నిరాశ చెందిన విషయం అదే!

సారాంశం

బోళా శంకర్ మూవీతో తన వెకేషన్ ప్లాన్స్ మొత్తం డిస్టర్బ్ అయ్యాయి అంటుంది తమన్నా. తీరిక లేని షెడ్యూల్స్ నుండి కొంచెం విరామం తీసుకుందాం అంటే... చిరు మూవీ దెబ్బేసిందని ఓపెన్ కామెంట్ చేసింది.   

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ పూజా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, గోపిచంద్ మలినేని, హరీష్ శంకర్, వివి వినాయక్,కె రాఘవేంద్రరావు, బాబీ హాజరయ్యారు. భోళా శంకర్ చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, కె ఎస్ రామారావు కూడా రావడం జరిగింది. కాగా బోళా శంకర్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైన తమన్నా సైతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 


అయ్యప్ప మాల ధరించిన చిరంజీవి, ఈ ఈవెంట్ లో చాలా ప్రశాంతంగా కనిపించారు. కాగా అనంతరం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. మీడియా సమావేశంలో పాల్గొన్న తమన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా తీరికలేని షెడ్యూల్ తో అలసిపోయాను. దీనితో కొంచెం విరామం తీసుకొని వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను. అయితే భోళా శంకర్ (Bhola shankar) ఆఫర్ తో, నా వెకేషన్ ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోయాయి.. అన్నారు తమన్నా. 

Also read Chiranjeevi: భోళా శంకర్ కి శ్రీకారం చుట్టిన చిరు!
కేవలం మూడు రోజుల క్రితం తమన్నా పేరును భోళా శంకర్ హీరోయిన్ గా ప్రకటించారు. దీనితో ఆమెకు ఈ మూవీలో ఆఫర్ గురించి ముందస్తు సమాచారం లేదు. బ్రేక్ దొరికిందని భావించిన తమన్నా ఫ్యామిలీ లో ఓ టూర్ ప్లాన్ చేశారట. ఇంకా మాట్లాడుతూ... దర్శకుడు మెహర్ రమేష్ తో పని చేయాలని, చాలా కాలంగా కోరుకుంటున్నాను, అయితే అనేక కారణాల చేత అది కుదరలేదు. ఇప్పుడు నా కల సాకారం అయ్యింది, అని తమన్నా తెలిపారు. 

Also read 'ఆర్ ఆర్ ఆర్' స్పెషల్ ప్రీమియర్ ఆల్రెడీ వేసారట
ఇక చిరంజీవితో రెండో సారి జతకడుతుంది తమన్నా(Tamannah). పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా చిరు ప్రేయసి పాత్ర చేశారు. మరోమారు భోళా శంకర్ చిత్రంతో ఆమె చిరు సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ మూవీలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, తమన్నా చెప్పడం విశేషం. బోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు