జీవితంలో మరచిపోలేని రోజు అంటూ సోషల్ మీడియాకు అల్లు హీరో గుడ్ బై, కారణం ఇదే

pratap reddy   | Asianet News
Published : Nov 12, 2021, 10:57 AM IST
జీవితంలో మరచిపోలేని రోజు అంటూ సోషల్ మీడియాకు అల్లు హీరో గుడ్ బై, కారణం ఇదే

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు శిరీష్ నటించిన చిత్రాల్లో ఒకటి రెండు పర్వాలేదనిపించే విధంగా రాణించాయి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు శిరీష్ నటించిన చిత్రాల్లో ఒకటి రెండు పర్వాలేదనిపించే విధంగా రాణించాయి. దీనితో శిరీష్ పూర్తి స్థాయి సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శిరీష్ ప్రేమ కాదంట అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మరో చిత్రానికి కూడా సైన్ చేశాడు. 

తదుపరి చిత్రాల కోసం మేకోవర్ మార్చుకునేందుకు Allu Sirish జిమ్ లో కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కండలు తిరిగిన తన బాడీని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా శిరీష్ అభిమానులని సర్ ప్రైజ్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలం తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. 

11-11-2021 నా ప్రొఫెషనల్ లైఫ్ లో మరచిపోలేని రోజు. చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నా. ఎందుకు ఏంటనే విషయాలు రానున్న రోజుల్లో తెలియజేస్తా. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు శిరీష్ ప్రకటించాడు. 

Also Read: పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. హీరోయిన్లతో రాంచరణ్ రొమాన్స్ గురించి ఇలా, నేనూ మనిషినే..

అసలు ఏమైంది అంటూ అభిమానులు వరుసగా కామెంట్స్ చేస్తుండడంతో సిరీస్ సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ లోకి వెళుతున్నావా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన నాకు లేదు. నా తదుపరి చిత్ర కథ లాక్ అయింది. నా కెరీర్ లోనే ది బెస్ట్ స్టోరీ అది అని శిరీష్ తెలిపాడు. మరికొందరు అభిమానులు లవ్ సెట్ అయ్యిందా అని సరదా కామెంట్స్ కూడా చేస్తున్నారు. 

Also Read: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'

ఇదిలా ఉండగా శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ప్రేమ కాదంట చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్