పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారో... సినిమాలో నేను అదే చేశాను, రిపోర్టర్ కి హీరోయిన్ బోల్డ్ ఆన్సర్!

By team teluguFirst Published Nov 12, 2021, 10:57 AM IST
Highlights

సందు దొరికితే స్టార్స్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు విలేకర్లు. అందుకే వాళ్ళ ప్రశ్నలకు ఆచి తూచి సమాధానం చెప్తారు నటులు. అయితే ఒక్కోసారి రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలు చికాకు తెప్పిస్తాయి. దానితో కొందరు స్టార్స్ మీడియా ముఖంగా ఫైర్ అవుతారు. 
 

కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ (Rachita ram) లేటెస్ట్ గా ఓ రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ యూ రచ్చు'. ఈ సినిమాలో రచిత రామ్ కొన్ని బోల్డ్ సన్నివేశాలలో పాల్గొన్నారు. కాగా మూవీ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఓ విలేకరి ఆమెను.. లవ్ యూ రచ్చు మూవీలో బోల్డ్ సన్నివేశాల్లో పాల్గొన్నారట, కదా? గతంలో ఇలాంటి సన్నివేశాల్లో నటించను అన్నారు?, అని అడిగారు. 


ఈ ప్రశ్నకు సమాధానంగా... పెళ్లి తరువాత మీరు ఏం చేస్తారు? రొమాన్సే కదా? అదే ఈ సినిమాలోనే నేను చేశాను. గతంలో ఐ లవ్ యూ మూవీలో నేను బోల్డ్ సన్నివేశాల్లో నటించాను. అప్పుడు మా పేరెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అందుకే ఇకపై అలాంటి సన్నివేశాలలో నటించను అని చెప్పాను. మరలా Love you rachhu మూవీలో అలాంటి సన్నివేశాల్లో నేను ఎందుకు నటించానో, సినిమా చూస్తే అర్థం అవుతుంది. కథ డిమాండ్ చేస్తే... బోల్డ్ సన్నివేశాల్లో నటించక తప్పదు... అంటూ ఆమె ఓపెన్ గా షాకింగ్ కామెంట్స్ చేశారు. 


రచిత రామ్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరోవైపు ప్రస్తుతం రచిత రామ్ ఏకంగా 15 చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో దాదాపు అన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా వదిలేస్తే... ఏక కాలంలో అన్ని చిత్రాలలో నటించడం నిజంగా గొప్ప విషయం. 

Also read తన పెళ్లిపై కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చి చిత్రంతో రచిత రామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు పులి వాసు సూపర్ మచ్చి చిత్రానికి దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సూపర్ మచ్చి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Also read మొత్తానికి ‘జాతిరత్నాలు’హీరోయిన్ ని గుర్తించారు
 

click me!