ఇది ఇంకోటి: “భీమ్లా నాయక్” ఆల్ ఇండియా రికార్డు

By Surya PrakashFirst Published Sep 12, 2021, 4:34 PM IST
Highlights


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. తన హీరో మీదున్న అభిమానాన్ని వారు ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు. 

'వకీల్ సాబ్' మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద అదరకొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా చేస్తూరిలీజ్ కు ముందే రికార్డుల సునామీ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తూ రికార్డుల మోత మోగిస్తోంది.   ఈ పాట అరుదైన ఫీట్ సాధించింది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ.. 'భీమ్లా నాయక్' నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులను ఆనందపరిచింది. ఇప్పుడు మరో రికార్డ్ ని భీమ్లానాయక్ నెలకొల్పింది.

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కూడా ఊహించని రీతిలో వ్యూస్ ను పొందటమే కాకుండా, లైక్స్ లో ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న గ్లింప్స్ గా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

POWER STORM bulldozing it's way ahead ⚡ is now the FIRST & FASTEST 1 MILLION LIKED Glimpse 🔥

➡️ https://t.co/A25VE51Puy pic.twitter.com/w9JutZpxeU

— Sithara Entertainments (@SitharaEnts)

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  రానాని కూడా హైలైట్ చేస్తూ త్వరలోనే ఓ టీజర్‌ని విడుదల చేయాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికైతే అధికారంగా ఎలాంటి సమాచారం లేదు. 

 సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఇది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుండగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

click me!