డ్రగ్స్ కేసు :వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్లో సోదాలు

By Surya PrakashFirst Published Oct 16, 2020, 7:22 AM IST
Highlights

 కోర్టు వారెంట్‌ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్‌ పోలీసులు వివేక్‌ ఇంటికి వెళ్లారని బెంగళూరు సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.  
 

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. కన్నడ పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో నిందితుడు ఆదిత్య అల్వా కోసం అతడి బంధువైన వివేక్‌ ఇంట్లో సోదాలు చేపట్టారు. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడనీ, వివేక్‌ ఇంట్లో ఉన్నట్టు తమకు అందిన సమాచారం మేరకు సోదాలు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు వారెంట్‌ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్‌ పోలీసులు వివేక్‌ ఇంటికి వెళ్లారని బెంగళూరు సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.  

ఆదిత్య అల్వా కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు. కన్నడ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్‌ వినియోగం, సరఫరా కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిత్య పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇక ఇప్పటికే  రేవ్‌పార్టీలు, మత్తుమందు సరఫరాదారులు, అమ్మకం దార్లపై పోలీసులు విరుచుకుపడిన నేపథ్యంలో కన్నడ సినీనటులు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీసహా కొందరు నైజీరియన్లను అరెస్ట్‌ చేయడం తెల్సిందే. రెండు నెలల క్రితం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు బెంగళూరులో అరెస్ట్‌ చేసిన ముగ్గురు వ్యక్తులు తాము నటులకు మత్తుమందులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతోనే ఈ అరెస్ట్‌లు జరిగాయని సమాచారం. 
 

click me!