కత్తి మహేష్ కి బండ్ల గణేష్.. సీరియస్ వార్నింగ్

Published : Aug 29, 2017, 04:11 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
కత్తి మహేష్ కి బండ్ల గణేష్.. సీరియస్ వార్నింగ్

సారాంశం

బండ్ల గణేష్ కి ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ అభిమానుల మ్యానియా గురించి ఇతడు చేసిన కామెంట్స్ ఇప్పటికే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి ఈవివాదాలకు బండ్ల గణేష్ తన దైన శైలిలో స్పందించాడు

 

పవన్ కళ్యాణ్ పరమ భక్తుడు ఎవరయ్యా అంటే.. ముందుగా వినపడే పేరు  బండ్ల గణేష్. నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి.. నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ కి ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. అంత అభిమానం ఉన్న ఆయన పవర్ స్టార్ ని ఏదైనా అంటే ఊరుకుంటాడా.. అందుకే ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగాడు.

గత కొద్దిరోజులుగా మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ( బిగ్ బాస్ ఫేం)  పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కు మెగా అభిమానులు ముఖ్యంగా పవన్ అభిమానులు తీవ్ర అసహానానికి లోనవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశ్యాల గురించి ముఖ్యంగా ‘జనసేన’ గురించి పవన్ అభిమానుల మ్యానియా గురించి ఇతడు చేసిన కామెంట్స్ ఇప్పటికే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.

 

ఈ నేపధ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈవివాదాలకు బండ్ల గణేష్ తన దైన శైలిలో స్పందించాడు.‘తమ్ముడు కత్తి మహేష్ సూర్యుడి వైపు చూడకు ఆ సూర్య కిరణాల మైన మా లాంటి వారిచే మాడి మసైపోతావు' అంటూ ట్వీట్ చేశాడు. నీతి నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవార్ స్టార్ కు రాదు లేదు అంటూ మరో అభిమాని చేసిన ట్వీట్‌ను బండ్ల గణేష్ రీట్వీట్ చేశాడు.

 

సూర్యుడి శక్తి గురించి, పవన్ అర్హతల గురించి ఎవరైనా మాట్లాడటం హాస్యాస్పదంగా అంటుంది అంటూ కత్తి మహేష్ను ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించాడు.  ప్రస్తుతం సినిమాలు తీయకుండా ఖాళీగా ఉంటున్న ఈ మెగా ప్రొడ్యూసర్ పవన్ ‘జనసేన’ వైపు అడుగులు వేస్తున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. పవన్ పై తనకున్న భక్తిని మరొకసారి చాటుకున్న ఈ మెగా నిర్మాత ఆవేశాన్ని పవన్ ఎంత వరకు గుర్తిస్తాడో చూడాలి..

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా