
శ్రియా సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ.. ఆమె అందం కొంచెం కూడా తగ్గలేదు. ఈ తరం హీరోయిన్లకు పోటీగా సినిమా ఛాన్సులను అందుకుంటోంది. అంతే కాదు తెలుగు సినీ రంగంలో ఉన్న హాట్ బ్యూటీలు ఎవరబ్బా అంటే.. మొదటి వరసలో శ్రియా ఉంటుంది. ఇటీవల జరిగిన పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ లో శ్రియా చూసిన వారు ఎవరైనా ఈ మాటలు నిజమని ఒప్పుకుంటారు.
ప్రస్తుతం శ్రియా.. బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో నటిస్తోంది. ఆమె నటిస్తే.. సినిమా విజయం సాధింస్తుందనే నమ్మకం బాలకృష్ణ కి ఉంది. అందుకే గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత కూడా ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. చిరంజీవి, నాగార్జున దగ్గర నుంచి ఈ తరం హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ ల సరసన కూడా నటించింది.
అలాంటిది రెన్యుమరేషన్ తీసుకోవడంలో మాత్రం శ్రియా చాలా వెనుకబడి ఉందట. పైసా వసూల్ చిత్రానికి ఆమె కేవలం రూ.50లక్షలు రెన్యుమరేషన్ తీసుకుంటుందట. ఆమెతో పాటు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొందరు హీరోయిన్లు కోటిపై నే తీసుకుంటున్నారు. అంతెందుకు నిన్న కాక మొన్న వచ్చిన తారలు కూడా దాదాపు రూ.కోటి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం శ్రియాను పాపం అనాల్సిందే. ఆమె పారితోషకం పెరగాలంటే... కచ్చితంగా ఆమె జాబితాలో ఒక బ్లాక్ బస్టర్ పడాలి. అది పైసా వసూల్ తో జరిగితే.. ఆమె రెన్యుమరేషన్ పెరుగుతుందేమో చూడాలి.