
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ (Akhanda) కలెక్టన్స్ వర్షం కురిపిస్తుంది. పదిరోజుల్లో వందల కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించిన అఖండ జైత్రయాత్ర కొనసాగుతుంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి తగ్గలేదు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ రికార్డులకెక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా అఖండ భారీ వసూళ్లు రాబట్టడం విశేషం.
యూస్ లో $1 మిలియన్ మ్యాజిక్ మార్కును అఖండ అందుకుంది. అఖండగా బాలయ్య నటవిశ్వరూపం చూపించగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఏళ్ల తర్వాత వచ్చిన అరుదైన విజయనాన్ని బాలకృష్ణ ఆస్వాదిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదే సమయంలో భగవంతుడి పట్ల కృతగ్నతలు ప్రకటిస్తున్నారు. వరుసగా బాలయ్య పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
నిన్న అఖండ దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డితో పాటు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో బాలయ్య ప్రత్యేక పూజలు చేసి, అర్చకుల ఆశీర్వాదం అందుకున్నారు. కాగా నేడు బాలకృష్ణ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. బాలయ్యతో పాటు తిరుమలకు బోయపాటి కూడా రావడం జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం బాలయ్య ఆలయ ప్రాంగణంలో కనిపించారు. ఇక బాలయ్యను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.
Also read Unstoppable Promo: బాలయ్యకి చుక్కలు చూపించిన రాజమౌళి.. నాలుక కర్చుకున్న `అఖండ` స్టార్
కాగా అఖండ విజయం బాలయ్యలో తిరిగి జోష్ నింపింది.ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో బాలయ్యకు జంటగా శృతి హాసన్ (Shruti haasan) ఎంపికైన విషయం తెలిసిందే.
అనంతరం బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకీ-వరుణ్ లతో ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు.