Trivikram Wife: త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిథిగా ఎవరో తెలుసా!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 16, 2021, 09:38 AM IST
Trivikram Wife: త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిథిగా ఎవరో తెలుసా!

సారాంశం

మాటల మాంత్రికుడు Trivikram Srinivas రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. మూసధోరణిలో ఉన్న సినిమా డైలాగులకు చెక్ పెడుతూ టాలీవుడ్ కి పంచ్ డైలాగులని పరిచయం చేశారు.

మాటల మాంత్రికుడు Trivikram Srinivas రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. మూసధోరణిలో ఉన్న సినిమా డైలాగులకు చెక్ పెడుతూ టాలీవుడ్ కి పంచ్ డైలాగులని పరిచయం చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వ శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. మాస్ చిత్రాల్లో కూడా క్లాస్ టచ్ కనిపిస్తుంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించరు. కాబట్టి ఆయన ఫ్యామిలీ గురించి అభిమానులకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. 

Trivkram సతీమణి Soujanya గురించి మాత్రం కొన్ని అరుదైన సంగతులు బయటకు వచ్చాయి. ఆమె క్లాసికల్ డాన్సర్ అని అందరికి తెలుసు. పలు సందర్భాల్లో ఆమె వేదికలపై నృత్య ప్రదర్శన ఇచ్చారు. క్లాసికల్ డ్యాన్స్ లో సౌజన్యకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. సౌజన్య మరోసారి నృత్య ప్రదర్శనకు రెడీ అవుతున్నారు. సౌజన్య నృత్య ప్రదర్శన కార్యక్రమం రేపు అంటే డిసెంబర్ 17న శిల్ప కళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. 

ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ స్నేహితుడు పవర్ స్టార్ Pawan Kalyan ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 'మీనాక్షి కళ్యాణం' అని సౌజన్య నృత్య రూపంలో ప్రదర్శిస్తారు. పసుమర్తి రామలింగయ్య ఈ డ్యాన్స్ షోకి దర్శకత్వం వహించనున్నారు. హారికా అండ్ హాసిని సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ సంస్థకు త్రివిక్రమ్ ఆస్థాన దర్శకుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. 

ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2 నే జరగాల్సింది. కానీ లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో వాయిదా పడింది. త్రివిక్రమ్, సౌజన్య ల పెళ్లి విషయంలో సిరివెన్నెల ప్రమేయం ఎంతైనా ఉంది. సిరివెన్నెల సోదరుడి కుమార్తె సౌజన్య. త్రివిక్రమ్, సౌజన్య వివాహం నాటకీయంగా జరిగింది. వల్ల అక్క కోసం సిరివెన్నెల త్రివిక్రమ్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. కానీ త్రివిక్రమ్ మాత్రం సౌజన్యని ఇష్టపడ్డారు. పెద్దలని ఒప్పించి ఆమెని వివాహం చేసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?