Liger Release Date : లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్..రౌడీ హీరో ఫ్యాన్స్ కు పూనకాలే

Published : Dec 16, 2021, 11:05 AM ISTUpdated : Dec 16, 2021, 11:08 AM IST
Liger Release Date : లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్..రౌడీ హీరో ఫ్యాన్స్ కు పూనకాలే

సారాంశం

విజయ్ దేవరకొండ లైగర మూవీ నుంచి భారీ అప్ డేట్ ను వదిలారు మేకర్స్. సినిమా వచ్చే ఏడాది అగస్ట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ ట్రీట్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు టీమ్.   


రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో పాన్ ఇండియాలెవల్లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. కరోనా కారణంగా డిలై అవుతూ వస్తున్న ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. రౌడీ ఫ్యా్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు టీమ్, వచ్చే ఏడాది ఆగస్ట్ 22న ప్రపంచ వ్యాప్తంగా లైగర్ సినిమాను తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ,హిందీ కలుపుకుని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 


ఇక లైగర్ ట్రైటర్ ట్రీట్ ను ఈనెల 31న న్యూ ఇయర్ గిఫ్ట్ గా వదలబోతున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు టీమ్. Vijay Deverakondaతో పాటు ఈ మూవీ ప్రొడ్యూసింగ్ పార్ట్ నర్ చార్మీ కౌర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కరోనా రెండు వేవ్ ల తరువాత రీసెంట్ గానే లైగర్ షూటింగ్ షెడ్యూల్ రీ స్టార్ట్ అయ్యింది. ఈమూవీలో హాలీవుడ్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. 

 


రీసెంట్ షెడ్యూల్ లోనే టైసన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు టీమ్. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మిగిలిన భాగం షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday ) హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. తనిష్ బగ్చీ సాంగ్స్ అందిస్తున్నారు.  పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ తో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ కరణ్ జోహార్ ధర్మప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రమ్మకృష్ణ, మకరంద్ దేశ్ పాండే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. 


విజయ్ దేవరకొండ ఈసినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. విజయ్ వరుసగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసి ఉన్నాడు. ఈరెండు సినిమాల తరువాత రెండేళ్లకు.. అది కూడా పాన్ ఇండియా లెవ్లలో లైగర్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తరువాత సుకుమార్, శివనిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా కమిట్ అయ్యి ఉన్నారు. అటు బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ అందుకుంటున్నారు విజయ్. లైగర్ సక్సెస్ అయితే.. పాన్ ఇండియా స్టార్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పాలని చూస్తున్నాడు విజయ్. 

Also Read Unstoppable Promo: బాలయ్యకి చుక్కలు చూపించిన రాజమౌళి.. నాలుక కర్చుకున్న `అఖండ` స్టార్‌
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు