`ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప` మధ్యలో సాండ్‌విచ్‌ అయిపోతుంది..`శ్యామ్‌ సింగరాయ్‌`పై నాని షాకింగ్‌ కామెంట్‌

Published : Dec 14, 2021, 11:17 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప` మధ్యలో సాండ్‌విచ్‌ అయిపోతుంది..`శ్యామ్‌ సింగరాయ్‌`పై నాని షాకింగ్‌ కామెంట్‌

సారాంశం

మంగళవారం వరంగల్‌ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. దిల్‌రాజు సైతం పాల్గొని సందడి చేశాడు. `ఎంసీఏ`ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్లు సాయిపల్లవి పట్టుశారీలో మెరిస్తే, కృతి శెట్టి ట్రెండీ వేర్ లో కనువిందు చేసింది. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నేచురల్ స్టార్ నాని(Nani).. షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తాను హీరోగా నటించిన `శ్యామ్‌ సింగరాయ్‌`(Shyam Singha Roy) చిత్రాన్ని ఏకంగా సాండ్‌విచ్‌తో పోల్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie), `పుష్ప`(Pushpa) చిత్రాలతో పోల్చుతూ మరీ తన చిత్రంపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు నాని. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నాని హీరోగా నటించగా, ఆయనకు జోడీగా కృతి శెట్టి, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్‌ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. దిల్‌రాజు సైతం పాల్గొని సందడి చేశాడు. `ఎంసీఏ`ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్లు సాయిపల్లవి పట్టుశారీలో మెరిస్తే, కృతి శెట్టి ట్రెండీ వేర్ లో కనువిందు చేసింది. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్‌ సుమపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు వెయిట్‌ చేస్తుంటారు. కానీ వీరంతా వెయిట్‌ చేసేది యాంకర్‌ సుమ డేట్స్ కోసమని పంచ్‌లు వేశాడు. ఆమె బిజీగా ఉంటుందని, ఆమె కోసం ఈవెంట్ల డేట్లు మార్చుకోవాల్సి వస్తుందని తెలిపారు Nani. 

ఇక `ఎంసీఏ` టైమ్‌లో తాను, సాయిపల్లవి ఇదే గ్రౌండ్‌లో కలిశామని, ఆ సినిమా విజయం సాధించిందన్నారు. మళ్లీ అదే కాంబినేషన్‌లో ఈ స్టేజ్‌పై ఉన్నామని అంతకు మించిన రిజల్ట్ ఈ నెల 24న చూడబోతున్నారని తెలిపారు. `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమా గురించి చెబుతూ, ముందు `పుష్ప`, తర్వాత `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మధ్యలో తమ సినిమా ఉందని, రెండింటి మధ్య సాండ్‌విచ్‌ అయిపోతుందా? అని తెలిపారు నాని. అంతేకాదు సాండ్‌విచ్‌లో రెండింటి మధ్యే అసలైన సర్ప్రైజ్‌ ఉంటుందని, అదే తమ `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రమన్నారు నాని. గర్వంగా చెబుతున్నాను క్రిస్మస్‌ మనదే. రాహుల్‌ అద్బుతంగా సినిమా తీశాడు. 

సాయిపల్లవి గురించి చెబుతూ, సాయిపల్లవి నుంచి డాన్సుని ఎక్స్ పెక్ట్ చేస్తారని, కానీ ఇందులో పెద్ద డాన్సు సర్‌ప్రైజ్‌ ఉందన్నారు. ఆ పాటని ఇంకా విడుదల చేయలేదని, `దేవి` పై వచ్చే పాట అని, మైండ్ బ్లోయింగ్‌గా డాన్సు చేసిందన్నారు. ఆ సాంగ్‌లో ఆమె డాన్సు చేస్తుంటే, జనంలో కూర్చొని ఆశ్చర్యపోయాను. కృతి శెట్టి గురించి చెబుతూ, ప్రశంసలు కురిపించారు. తన పాత్ర కోసం ఎంతో కష్టపడింది. ప్రతి సీన్‌ డిస్కషన్‌ చేసేది. బ్యూటీఫుల్‌గా చేసింది. తన పెద్ద హీరోయిన్‌ అవుతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేకపోవడం చాలా బాధగా ఉందని, తనకు ఆయన అభిమాని అని, అప్పుడప్పుడు తన సినిమాలు చూస్తే ఫోన్‌ చేసేవారని చెప్పారు నాని. ఆయన ఆఖరి పాట మా సినిమాల్లో ఉండటం గర్వంగా ఉంది. రెండేళ్ల తర్వాత థియేటర్లో వస్తున్నానని, 24న టాప్‌ లేచిపోవాలని తెలిపారు.
also read: Shyam Singh Roy trailer: దేవుడినైనా ఎదురించమంటోన్న నాని.. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌