త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం : బాల‌కృష్ణ‌

Published : Aug 31, 2017, 08:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం : బాల‌కృష్ణ‌

సారాంశం

ఎన్టీఆర్  జీవితం ఆధారంగా సినిమా తీయనున్న బాల‌కృష్ణ ఈ మూవీలో త‌న తండ్రి పాత్ర‌ను తానే చేయ‌బోతున్న‌ట్లు తెలిపిన బాల‌కృష్ణ‌ త్వ‌ర‌లోనే మూవీ డైరెక్ట‌ర్ పేరు, మూవీకి సంబంధించిన వివ‌రాలు తెలుప‌నున్న బాల‌య్య‌

తన తండ్రి, ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను తానే చేయబోతున్నట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. అయితే బాలయ్య ఈచిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర వివరాలేమీ ప్రకటించకుండా వరుస సినిమాలు కమిట్ అవుతూ ముందుకు సాగుతుండటంతో ఈ చిత్రం ఆగిపోయిందనే అనుమానాలు సైతం కొందరిలో వ్యక్తం అయ్యాయి.

 

ఈ నేపథ్యంలో బాలయ్య పైసా వసూల్ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు. త్వరలో దర్శకుడిని ప్రకటిస్తా ఈ విషయమై బాలయ్య పాత్రికేయులతో బాలకృష్ణ మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ చిత్ర దర్శకుడిని ప్రకటిస్తామని, సినిమా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అన్ని వివరాలు సేకరిస్తున్నాం ఈ సినిమా కోసం తమ బంధువులను, తన తండ్రి సహచరుల్ని, ఆయన వద్ద పని చేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నట్టు బాలకృష్ణ వెల్లడించారు.

 

 ఈ సినిమా విషయమై ఇటీవలే తాను చెన్నైకు వెళ్లి వచ్చానని, తన తండ్రి సినీ రంగానికి రాకముందు విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పారు.  ప్రతి రోజూ ఉదయం 3.30 గంటలకు నిద్ర లేస్తాను. ప్రతిక్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మర్చిపోను. తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది, తాను నిలబెట్టుకుందీ అదేనని బాలయ్య చెప్పుకొచ్చారు. 

 

 పని లేకుండా ఖాళీగా ఉండటం నా వల్ల కాదు. తన స్వభావానికి తగ్గట్టుగానే తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తాను చేస్తున్న పనులన్నీ సంతృప్తిని ఇస్తున్నాయని బాలయ్య తెలిపారు

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి