వెంక‌టేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Published : Aug 31, 2017, 07:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వెంక‌టేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హిరో గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అర్జున్ రెడ్డి మూవీ హిట్ తో వ‌రుస ఆఫర్లు అందుకుంటున్న విజ‌య్  త్వ‌ర‌లోనే విక్ట‌రీ వెంక‌టేష్ తో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్ఏలో తొలి 4 రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 21 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం.

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ త్వరలో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలోనే విజయ్ ఈ ఆఫర్ ఓకే చేసినట్లు టాక్.

 

ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ బేనర్లోనూ మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అర్జున్ రెడ్డి సంచలం విజయ్ దేవరకొండ ఆఫర్లు వెల్లువలా వస్తున్నా... పెద్ద బేనర్ సినిమాలో.., మంచి డెప్త్ వున్న కథలో ఎంచుకుంటున్నాడని తెలుస్తోంది. మరంతేకదా.. రెండు ఫ్లాపులు పడితే అంతే సంగతి. కాబట్టే జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి