వరంగల్ రోడ్లపై నాని బైక్ మీద సాయిపల్లవి-జనం ఫిదా

Published : Aug 31, 2017, 12:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
వరంగల్ రోడ్లపై నాని బైక్ మీద సాయిపల్లవి-జనం ఫిదా

సారాంశం

వరంగల్ రోడ్లపై బైక్ మీద తిరుగుతున్న నాని, సాయిపల్లవి ఎంసీఏ మూవీ షూటింగ్ కోసం వరంగల్ నగరంలో నాని, సాయి పల్లవి రోడ్లపై బైక్ మీద తిరుగుతుంటే ఫిదా అయిన వరంగల్ వాసులు

వరుస విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ఎంసీఏ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్‌ నాని ఇటీవల వరంగల్ రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. అది కూడా ఓ అమ్మాయిని తన బైక్‌ పై కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తు‍న్నాడు.

 

నాని ఇప్పుడు వరంగల్ సిటీలో ఎంసీఏ చదువుతున్నారు. అదేదో నిజం చదువనుకోకండి. ప్రస్తుతం నాని ఎంసీఏ(మిడిల్‌క్లాస్‌ అబ్బాయి) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం కోసం నాని, సాయి పల్లవి ఇద్దరూ వరంగల్ రోడ్ల మీద బైక్ పై చక్కర్లు కొడుతున్నారు.

 

ఈ బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్‌ పై వెళ్తుండటం చూసి స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవల నిన్నుకోరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని, ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నాడు.

 

నాని తెలుగు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉన్న హీరో. సాయి పల్లవి ఒక్క సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన హీరోయిన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అంతేకాక హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సారధ్యంలో.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో.. భూమిక కీలక పాత్రలో... విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు నటిస్తున్న ఈ సినిమా ఎంత ప్రత్యేకమైందో దీన్ని బట్టే తెలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు