మహేష్ కోసం కొరటాల కోటి పెట్టి కొన్నాడట

Published : Apr 05, 2017, 02:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మహేష్ కోసం కొరటాల కోటి పెట్టి కొన్నాడట

సారాంశం

మహేష్ కోసం కథను వేరే రచయిత వద్ద కొన్న కొరటాల శివ కథ, కథనం నచ్చటంతో కోటి పెట్టి కొన్న కొరటాల శివ  

శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి.

 

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ పరిశీలుస్తున్నారట. తాజాగా కొరటాల తెరకెక్కించనున్న ఈ సినిమా కథకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

 

తన గత చిత్రాలను సొంత కథలతో తెరకెక్కించిన కొరటాల శివ ఈసారి మాత్రం మహేష్ కోసం వేరే రచయిత నుంచి కథను తీసుకున్నాడని తెలుస్తోంది. తకిట తకిట, సత్యభామ లాంటి సినిమాలను తెరకెక్కించిన నాను శ్రీహరి, మహేష్ సినిమాకు కథ అందిస్తున్నాడు. ఒక్క హిట్ కూడా లేని ఈ దర్శకుడు మహేష్ సినిమా కథకు మాత్రం ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కథా కథనం ఆసక్తికరంగా ఉండటంతోనే... అంత భారీ ధర పలికిన ఈ కథ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్