బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేది ఆరోజే...

Published : Apr 05, 2017, 02:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేది ఆరోజే...

సారాంశం

వక్కంతం వంశీ కథను ఓకే చేసిన అల్లు అర్జున్ ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వంశీ బిజీ బిజీ బన్నీ వచ్చే పుట్టినరోజున ఈ సినిమాపై క్లారిటీ ఇస్తాడని టాక్  

అల్లు అర్జున్  పుట్టినరోజు ఈ శనివారం రాబోతోంది. అయితే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కేవలం బన్నీ బర్త్ డే కోసం మాత్రమే కాకుండా...  ఓ సినిమాపై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే వక్కంతం వంశీ సినిమా. బన్నీ పుట్టినరోజు నాడు ఆ మూవీ ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి.

 

బన్నీ-వక్కంతం సినిమాకు సంబంధించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" అనే పేరు పెట్టారనేది చాలా కాలంగా జరుగుతన్న ప్రచారం. ఇక మరో పుకారు ఏంటంటే ఈ ప్రాజెక్టులోకి కన్నడ భామ రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారట. ఇవి వాస్తవానికి దగ్గరగా అనిపిస్తున్నాయి.

 

ఇలాంటిదే ఇప్పుడు మరో రూమర్. అదీ ఈ రెండింటికి మించిన రూమర్ కూడా బాగానే చక్కర్లు కొడుతోంది. అదే.. బన్నీ-వక్కంతం సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నారని. ఇలా రోజుకో పుకారుతో షికారు చేస్తున్న బన్నీ-వక్కంతం సినిమాపై క్లారిటీ రావాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే.

 

బన్నీ పుట్టినరోజున వీళ్లిద్దరి కాంబోలో సినిమా ప్రారంభం కాకపోయినా, కనీసం మూవీకి సంబంధించిన విశేషాలు తెలిసే పరిస్థితి కనిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్