
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ పిఆర్ ఓ గా చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి , శక్తి బిఏ రాజు. అన్ని మీడియాల ఫిలిం జర్నలిస్ట్ లందరితో మమేకం అవుతూ చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అందరు జర్నలిస్టులను, అన్ని మీడియా సంస్థల ప్రతనిథులను సమదృష్టి తో చూసే ఏకైక నావికుడు బీఏరాజు. చిరు మందహాసం ఆయన ముఖాన ఎప్పుడూబ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. సినిమానే ఆశగా శ్వాసగా జీవించే బి ఏ రాజు అనుక్షణం సినిమా కోసం తపించి పోతుంటాడు . సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని గా సినిమా రంగంలో ఎంటర్ అయిన బి ఏ రాజు ఫిలిం జర్నలిస్ట్ గా , పిఆర్ ఓ గా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెరగని ముద్ర వేసాడు . టాప్ హీరోలతో అందరి తోనూ స్నేహశీలిగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన వార్తలను , అభిమానులు ఆశించే , వాళ్ళని సంతోషంలో ముంచెత్తే విషయాలతో సూపర్ హిట్ మ్యాగజైన్ ని 24 ఏళ్లుగా రన్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు .
ఒక సినిమా మ్యాగజైన్ లో ఎన్ని రకాల సంచలనాలను సృష్టించాలో , ఎన్ని రకాల కొత్త పోకడలు పోవాలో అన్నింటిని స్పృశించిన ధీశాలి బి ఏ రాజు . మీడియా రంగం ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుండటంతో మ్యాగజైన్ కు తోడుగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుండాలనే లక్ష్యం తో ఇండస్ట్రీ హిట్ అనే వెబ్ పోర్టల్ ని కూడా ప్రారంభించాడు . సంచలన వార్తలను అందించడం నిజంగా ఒక్క బి ఏ రాజుకే సాధ్యం కానీ సంచలన వార్తల పేరుతో గాసిప్ లను రాయడానికి వ్యతిరేకి ఎందుకంటే తనని ఆదరించి అక్కున చేర్చుకొని అన్నం పెడుతూ ఇంతటి వాడ్ని చేసింది ఈ చిత్ర పరిశ్రమ కాబట్టి ఆ పరిశ్రమలోని వ్యక్తులపై గాసిప్ లను వదలడం అన్నది ఆయన మనసులో కూడా రాని ఆలోచన కాబట్టి అటువంటి వార్తలకు మాటలకూ బహుదూరపు బాటసారి అతడు అందుకే గాసిప్ లకు దూరంగా వాస్తవికతకు దగ్గరగా సూపర్ హిట్ పత్రిక ని అభిమానులు గుండెల్లో పెట్టుకునేలా రూపొందించి సూపర్ హిట్ అయ్యాడు . పిఆర్ ఓ అనే పదానికి హీరోయిజం ని సంపాదించి పెట్టిన వ్యక్తి , సమ్మోహన శక్తి బి ఏ రాజు . ఈరోజే ఆ రాజు పుట్టినరోజు అందుకే అందుకోండి మా వందనాలు .