హైదరాబాద్ లో ఆర్మాన్ మాలిక్ లైవ్ కాన్సర్ట్, సందడి చేసిన సమంత

Published : Apr 12, 2023, 09:13 AM IST
హైదరాబాద్ లో ఆర్మాన్ మాలిక్  లైవ్ కాన్సర్ట్, సందడి చేసిన సమంత

సారాంశం

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ తో కలిసి సందడి చేసింది టాలీవుడ్ సీనియర్ బ్యూటీ సమంత. హైదరాబాద్ లో జరిగిన లైవర్ కాన్సర్ట్ లో..సమంత పాల్గొని.. ఆడియన్స్ ను ఉత్సాహపరిచింది. 

ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన అతిపెద్ద లైవ్ కాన్సర్ట్ లో సందడిచేశారు బాలీవుడ్ స్టార్ సింగర్ ఆర్మాన్ మాలిక్. సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు.. తన అద్భుతమైన ప్రదర్శణతో అందరికి ఆకట్టుకున్నాడు. అంతే కాదు ఈ ప్రొగ్రామ్ లో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది... టాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. సమంత. పనిలో పనిగా రెండురోజుల్లో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కూడా చేసేసుకుంది. 

హైదరాబాద్‌లోని అతిపెద్ద స్టూడెంట్ ఎన్జీవో సంస్థ స్ట్రీట్ కాజ్... ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తోంది. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ అండ్ టీమ్ తో  బషీర్‌బాగ్‌లోని LB స్టేడియంలో భారీ లైవ్ కచేరీని నిర్వహించింది. ఈ కచేరీలో నటి సమంత రూత్ ప్రభు కూడా పాల్గొని  అలరించారు. శాకుంతలం  మూవీ టీమ్ కూడా పాల్గొని సినిమాను ప్రమోట్ చేశారు. 

ఈ లైవ్ కన్సర్ట్ లో దాదాపు గా 30 వేల మంది వరకూ ఆడియన్స్ వచ్చినట్టు అంచనా. ఆర్మాన్ మాలిక్ కచేరీ అని తెలియడంతో దాదాపుగా  రెండు గంటల ముందే  స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. ఇక  అర్మాన్ ముందుగా టాలీవుడ్ లో తాను ఫేమస్ గా మారిన అలవైకుఠపురములో సినిమాలోని  బుట్టా బొమ్మా,  పాటతో స్టార్ట్ చేసి.. పెహ్లా ప్యార్ లాంటి ఫేమస్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను  అలరించాడు. అంతే కాదు అద్భుతమైన స్టేజ్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. 

ఈ ప్రోగ్రామ్ లో అర్మాన్ తన సూపర్ హిట్ సాంగ్స్ తో అలరించాడు. బుట్ట బొమ్మాతో మొదలు పెట్టి.. పడి పడి లేచే, రెండు కళ్ళు, నిన్నిలా నిన్నిలా, విన్ననే విన్ననే లాంటి తెలుగు సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు..  హిందీలో సూపర్ హిట్ అయిన  మై హూన్ హీరో తేరా, హలో, సూరజ్ దూబా హై, యేమైందో,  లబోన్ పే నామ్, జాన్ హై మేరీ లాంటి కొన్ని పాటలతో పాటు.. మరికొన్ని  రొమాంటిక్ సాంగ్స్ పాడి అలరించారు. ఆర్మాన్ పాటలకు ఉర్రూతలూగిపోయారు ఆడియన్స్.. ఆయనతో కలిసి పాడుతూ.. తెగ సందడి చేశారు. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ