క్రేజీ టైటిల్‌తో సుహాస్‌ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్‌ ఔట్‌

Published : Apr 11, 2023, 11:25 PM IST
క్రేజీ టైటిల్‌తో సుహాస్‌  కొత్త సినిమా.. ఫస్ట్ లుక్‌ ఔట్‌

సారాంశం

`కలర్‌ ఫోటో`, `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రాలతో విజయాలు అందుకున్న హీరో సుహాస్‌ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. ఓ క్రేజీ టైటిల్‌తో ఆయన రాబోతున్నారు. తాజాగా ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు.

`కలర్ ఫోటో`, `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకున్నాడు సుహాస్‌. హీరోగా నిలబడిపోయాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. అదే సమయంలో సుహాస్‌ సినిమా అంటే కచ్చితంగా ఏదో బలమైన కథ ఉంటుందనే, కొత్త కంటెంట్‌ ఉంటుందనే నమ్మకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అదే నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మరో క్రేజీ మూవీతో రాబోతున్నారు. `అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు` అనే సినిమా చేస్తున్నాడు సుహాస్‌. తాజాగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

సుహాస్‌తోపాటు `పుష్ప` జగదీష్‌, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీవారు, వెంకటేష్‌ మహా సమర్పణలో దుష్యంత్‌ కటికనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, జీఏ2 పిక్చర్స్, ధీరజ్‌ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. `భలే భలే మగాడివోయ్`, `గీత గోవిందం`, `టాక్సీవాలా`, `ప్రతిరోజూ పండగే`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` , `18 పేజెస్` లాంటి హింట్‌ చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు`.

ఈ సినిమా గురించి చిత్ర బృందం చెబుతూ, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్‌ మొదలు `కలర్ ఫోటో` సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా `రైటర్ పద్మభూషణ్` వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న  `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు` మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేసారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నాం` అని తెలిపింది యూనిట్‌. 

సినిమా: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు
బ్యానర్స్ : జీఏ2 పిక్చ‌ర్స్ & ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్స్ 
దర్శకుడు: దుష్యంత్ కటికనేని
డోప్: వాజిద్ బేగ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
కళ: ఆశిష్ తేజ పుల్లల్లా
కాస్ట్యూమ్స్: భరత్ గాంధీ
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌