తండ్రీ కొడుకులతో బెడ్ షేర్ చేసుకుంది, నటి సెలీనాపై ఉమైర్ సంధు ఘాటు ట్వీట్, భారీ వివాదం రేపిన బాలీవుడ్ క్రిటిక్

Published : Apr 12, 2023, 08:25 AM ISTUpdated : Apr 12, 2023, 08:28 AM IST
తండ్రీ కొడుకులతో బెడ్ షేర్ చేసుకుంది, నటి సెలీనాపై ఉమైర్ సంధు ఘాటు ట్వీట్, భారీ వివాదం రేపిన బాలీవుడ్ క్రిటిక్

సారాంశం

బాలీవుడ్ లో భారీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు. రోజు రోజుకు విమర్షల ఘాటు పెంచుతున్నాడు కాని.. తగ్గడంలేదు. తాజాగా బాలీవుడ్ నటి విషయంలో భారీ బాంబ్ పేల్చాడు ఊమైర్..   

బాలీవుడ్ లో కాంట్రవర్సీ కింగ్ అనిపించుకుంటున్నాడు ప్రముఖ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు. బాలీవుడ్ పైనే కాకుండాసౌత్ ఇండస్ట్రీపై కూడా రకరకాల ట్వీట్లలతో విరుచుకుపడుతుంటాయి. ఇక సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లో కూడా ఎంటర్ అయ్యి.. వాటి గురించి కూడా సోషల్ మీడియా వేదికపై రకరకాల ట్వీట్లు చేస్తూ.. హాట్ టాపిక్ అవుతున్నాడు ఉమైర్. ఇక తన గురించి తానే స్వయంగా సౌత్ ఏషియాలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ క్రిటిక్, బాలీవుడ్ గాసిప్ జర్నలిస్ట్ అని రాసుకున్నాడంటే.. ఉమైర్ గురించి ఇంతకన్నాచెప్పేదేముంటుంది. ప్లాప్ సినిమాలకు భారీ రేటింగ్ ఇస్తూ.. సూపర్ హిట్ సినిమాలను తన రివ్యూలతో ఏకిపడేస్తుంటాడు ఉమైర్. 

అంతే కాదు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చ పోస్ట్ లు పెడుతుంటాడు. తాజాగా బాలీవుడ్ నటిసెలీనా జైట్లీపై అలాంటి ట్వీట్ ఒకటి పెట్టి.. బాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చాడు ఉమైర్. తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీపై ఉమైర్ సంధు ఒక దిగజారుడు ట్వీట్ వదిలాడు. తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక నటి సెలీనా జైట్లీ..  అంటూ ట్వీట్ చేసి.. బాలీవుడ్ లో భారీ రచ్చకు తెర తీశాడు ఉమైర్. బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్ అండ్ ఫర్దీన్ ఖాన్ లతో ఆమె బెడ్ శేర్ చేసుకుందని పచ్చిగా రాశాడు. 

 

ఇక ఈ ట్వీట్ పై వెంటనే స్పందించింది బాలీవుడ్ నటి  సెలీనా జైట్లీ. ఆమె రిప్లై ఇస్తూ.. ఇలాంటి పోస్టులు చేయడం వల్ల నీకు ఆనందం, మగాడ్ని అనే భావన కలుగుతుందేమో. నీకున్న సమస్యను తగ్గించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. బహుశా నువ్వు డాక్టర్ ని కలిస్తే మంచిది..  అంటూ సెలినా జైట్లీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.  అంతే కాదు ఈ ట్వీట్ కు ..  ట్విట్టర్ సేఫ్టీని ట్యాగ్ చేస్తూ ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది సెలినా జైట్లీ. 

 

అంతటితో వివాదం ఆగలేదు. వెంటనే ఈ ట్వీట్ కు మరో రిప్లై ట్వీట్ ఇచ్చాడు  ఉమైర్ సంధు. ఆయన ట్వీట్ చేస్తూ.. నువ్వొక సీ గ్రేడ్ నటివి. నీ ఫిల్మోగ్రఫీ చూస్తేనే తెలుస్తుంది. నువ్వు చేసిన సినిమాలు ఏంటి? 2003 ఆడిషన్స్ సమయంలో నువ్వు నగ్నంగా నిల్చున్నావ్ అంటూ ఆమెపై మరింతగా రెచ్చిపోయాడు. దాంతో సోషల్ మీడియాలో ఇది భారీ వివాదంగా మారింది. బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. 

 

అటు ఉమైర్ సంధు ట్వీట్లపై బాలీవుడ్ లో పెద్ద చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా  అసహనం వ్యక్తం చేశారు. నెటిజన్స్ ఈ ఫేక్‌ రివ్యూవర్ ని వదలకండి.. పరువునష్టం దావా వేయండి అంటూ.. నెటిజన్ల నుంచి కూడా సలహాలు  కామెంట్ల రూపంలో వస్తున్నాయి. మరి ఇంత వివాదం రాజేసిన ఉమైర్ పై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి మరి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ