
తెలుగులో రెండు వారాల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి పొరుగు భాషల వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది. ఇది రీమేక్ కోసం అంత అనువైన సబ్జెక్ట్ కాకపోయినా. ఇలాంటి సినిమాల్ని రీక్రియేట్ చేయడం కష్టమే అయినా.ఇతర భాషల నుంచి ఈ చిత్రానికి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.
ఆల్రెడీ తమిళం నుంచి రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొనగా స్టార్ హీరో ధనుష్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు కన్నడ రీమేక్ హక్కులకు సంబంధించిన డీల్ కూడా దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఓ అగ్ర నిర్మాత అర్జున్ రెడ్డి హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ నిర్మాత మరెవరో కాదు.రాక్ లైన్ వెంకటేష్.
తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమాను నిర్మించడంతో పాటు రజినీకాంత్ ‘లింగా’కు కూడా నిర్మాతగా వ్యవహరించిన రాక్ లైన్. ఈ మధ్య జోరు తగ్గించాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడతను అర్జున్ రెడ్డి హక్కులు తీసుకుని ఓ ప్రముఖ కథానాయకుడితో కన్నడలో పునర్నిర్మించాలని చూస్తున్నాడు.
ఐతే అర్జున్ రెడ్డి హిందీ హక్కుల కోసం మాత్రం పెద్దగా పోటీ ఏమీ లేదని.. ఈ సినిమా అక్కడ రీమేక్ కాకపోవచ్చని తెలుస్తోంది. హిందీలో ఈ తరహా సినిమాలు కొత్తేమీ కాదు. ఐతే రూ.రూ.3-4 కోట్ల మధ్య బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి.రూ.5.5 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేసి. విడుదలకు ముందే లాభాలందుకున్న దర్శక నిర్మాతలు. రీమేక్, శాటిలైట్ ద్వారా మరింతగా ఆదాయం అందుకుంటున్నారు.