జ‌క్క‌న్న నెక్ట్స్ మూవీ  హిరో  రామ్ చ‌ర‌ణ్

Published : Sep 10, 2017, 07:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
జ‌క్క‌న్న నెక్ట్స్ మూవీ  హిరో  రామ్ చ‌ర‌ణ్

సారాంశం

బాహుబ‌లి మూవీతో ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ అయిన రాజ‌మౌళి జ‌క్క‌న నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులు జ‌క్క‌న్న సినిమాలో హిరో ఎవ‌ర‌నేది ఇప్పుడు హాట్ టాఫిక్  మెగా హిరో రామ్ చ‌ర‌ణ్ తో జ‌క్క‌న్న మూవీ అని ప్ర‌చారం 

 

బాహబలి సినిమాతో భారతదేశంలోనే టాప్ దర్శకులల్లో ఒకరిగా పేరు సంపాదించినా రాజమౌళి తర్వాత సినిమా ఏ విధంగా తీయబోతున్నాడన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని చెప్పకుండా ఎంత కాలం వెయిట్ చేయించాడో అంతకంటే ఎక్కువగా ఇపుడు ఆయన ఎవరితో ఎటువంటి సినిమా తీస్తాడన్నది టాలీవుడ్ లో తాజా చ‌ర్చ‌.

అయితే ఈ మధ్య ఆయన ఎవరితో మాట్లాడినా ఆ హీరోతోనే సినిమా అని గాసిప్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఇంకా ఏది డిసైడ్ కాలేదని చెబుతున్నాడు. కానీ ఈ మధ్య ఆయన చెర్రీతో ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. వీళ్ళిద్దరూ ప్రవరిస్తున్న తీరును చూస్తుంటే కూడా ఆ అనుమానాలకు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నట్లు అనిపిస్తోంది. 

ఎందుకంటే ఈ నెల 15న శ్రీవల్లి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్బంగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చెర్రీ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పుడు చెర్రీ రావడాన్ని చూస్తుంటే చాలామంది ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అదేమిటంటే.సైరా సినిమాకు పిలవగానే రాజమౌళి వెళ్ళాడు. ఇప్పుడు జక్కన్న పిలవగానే చెర్రీ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి మరీ   ఫంక్షన్ కి రాబోతున్నాడనే. 

ఈ విషయం సాధారణమైనదే అయినా మగధీరుడు అండ్ దర్శకదీరుడు ఈ మధ్య ఎక్కువగా కలుసుకుంటున్నారన్నది వాస్తవం. దీంతో ఎదో పెద్ద ప్రాజెక్టు కే టెండర్ వేసినట్లు ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం చెర్రీ సుకుమార్ సినిమాతోతో బిజీగా ఉన్నాడు అలాగే తర్వాత సినిమాని కొరటాలతో ఫిక్స్ చేసుకున్నాడు. 

ఒకవేళ సినిమా తియ్యడానికి రెడీ అయితే తప్పకుండా తీసేటట్లు ఉండాలి లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సో చెర్రీ బిజీ షెడ్యూల్ వల్ల కరెక్ట్ గా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?