ఆదివారం ఆడవాళ్లకు సెలవు అంటున్న ఎన్టీఆర్

Published : Sep 10, 2017, 01:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఆదివారం ఆడవాళ్లకు సెలవు అంటున్న ఎన్టీఆర్

సారాంశం

బిగ్ బాస్ హౌజ్ లో ఆసక్తికరంగా మారుతున్న వీకెండ్ ఎలిమినేషన్స్ ఇప్పటికే సేఫ్ జోన్ లో దీక్ష, శివబాలాజీ ఓటింగ్ లో ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్న హరితేజ, అర్చన అదర్శ్, నవదీప్, ప్రిన్స్ లలో ఎవరు వెళ్లిపోతారనేది ఆదివారం వెల్లడి

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య పోరు రాను రాను ఆసక్తిగా మారుతోంది. ఈ వారం సేఫ్ జోన్ లో దీక్ష,శివ బాలాజీ ఇప్పటికే వుండగా ఎలిమినేషన్‌‌లో ఉన్న ఐదుగురు టాప్ కంటెస్టంట్స్.. ప్రిన్స్,నవదీప్, ఆదర్శ్, అర్చన,హరితేజలలో హౌస్‌ను వీడేదెవరు? సేఫ్ జోన్‌కి వచ్చేదెవరు? ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ఎవర్ని హౌస్‌నుండి సాగనంపబోతున్నారనే ఆసక్తితో బిగ్ బాస్ సీజన్ 1 ఎపిసోడ్ 56 మొదలైంది.

 

56వ రోజు ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్‌లో తరచూ గొడవ పడే అర్చన, దీక్షలు ఫ్రెండ్స్ అయిపోయామంటూ కౌగిలించుకున్నా.. అది బయటికి మాత్రమేనని, అసలు తమ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందంతే.. అంటూ ఒకరినొకరు చిన్న విషయానికే పరస్పరం దూషణలు మొదలు పెట్టేశారు. ఇక బిగ్ బాంబ్‌ శిక్షతో స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగితేలుతున్న ‘హరితేజ’ శిక్షకాలం ముగిసిందని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ సూపర్ ఎంట్రీ ఇచ్చి ‘నా టీవీ’ ద్వారా బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో ముచ్చటించారు.



ఇక బిగ్ బాస్ కంటెస్టంట్స్ కోసం జరిగే ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరిస్తూ... మొన్నటి వారం ప్రేక్షకులనుండి కోటిన్నర ఓట్లురాగా... తరువాత వారం రెండు కోట్ల ఓట్లు వచ్చాయని.. ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కన్టెస్టెంట్స్ కోసం 2 కోట్ల 60 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌‌ కన్టెస్టెంట్స్‌ను ఇద్దరిద్దరుగా కన్ఫ్యూషన్ రూమ్‌కి పిలిచి బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. మొదటిగా దీక్ష, శివబాలాజీలు ఆదర్శ్ బిగ్ బాస్ హౌస్‌ను వీడొచ్చని, హరితేజ ఫైనల్ వరకూ ఉండొచ్చన్నారు. ఈ ఆరుగురిలో ఎక్కవమంది ఆదర్శ్ ఎలిమినేట్ కావొచ్చని.. హరితేజ కంటిన్యూ అవుతుందనే అభిప్రాయంతో ఏకీభవించారు.

 

మరోవైపు కీలకమైన ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న హరితేజ,అర్చన, నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్‌ లలో అర్చన, హరితేజలు సేఫ్ అయ్యి నెక్ట్ వారానికి ప్రమోట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్‌లో ఆదర్శ్, నవదీప్, ప్రిన్స్‌ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి వెళ్లిపోతారు.

 

ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ మిగిలి వున్నందున రేపటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఆడవాళ్లు అర్చన, దీక్ష, అర్చనలు ఆదివారం హౌజ్ లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని ఆరోజు మగాళ్లు మాత్రమే పనిచేస్తారని ఎన్టీఆర్ చెప్పారు. బిగ్ బాస్ హౌజ్ మాదిరిగానే మీ హౌజ్ లో ఉన్న ఆడవాళ్లకు కూడా ఆదివారం సెలవు ప్రకటించాలని ఈ ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ను ఆంటూ ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఎపిసోడ్‌ ముగించారు ఎన్టీఆర్.

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్