'బంగార్రాజు' సంక్రాంతికే ఫిక్స్, ఏ సినిమా వెనక్కి వెళ్లిందో?

By Surya Prakash  |  First Published Nov 30, 2021, 8:59 AM IST

 వాస్తవానికి సంక్రాంతి కోసమే ఈ సినిమాను రెడీ చేశారు. కానీ బరిలో మూడు పెద్ద సినిమాలు ఉండడంతో ‘బంగార్రాజు’  టీమ్ ఆలోచనలో పడింది. మొన్నామధ్య నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ కూడా మూడు సినిమాలు బరిలో ఉండగా.. నాల్గో సినిమాకు చోటు దొరకదని.. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గినా.. తమ సినిమా వచ్చేస్తుందని మీడియాతో చెప్పింది.


కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ‘బంగార్రాజు’ . నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలోని 'బంగార్రాజు' పాత్రను టైటిల్ గా చేసుకుని, అదే దర్శకుడితో నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో నాగ్ డ్యూయెల్ రోల్ చేయగా, ఈ సినిమాలో చైతూ మరో ప్రధానమైన పాత్రలో చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

 ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. అసలైన పండగ ఫీల్ తెచ్చే సినిమా ఇదే అని.. ఆ డేట్ ను లాక్ చేసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి సంక్రాంతి కోసమే ఈ సినిమాను రెడీ చేశారు. కానీ బరిలో మూడు పెద్ద సినిమాలు ఉండడంతో ‘బంగార్రాజు’  టీమ్ ఆలోచనలో పడింది. మొన్నామధ్య నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ కూడా మూడు సినిమాలు బరిలో ఉండగా.. నాల్గో సినిమాకు చోటు దొరకదని.. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గినా.. తమ సినిమా వచ్చేస్తుందని మీడియాతో చెప్పింది. ఇప్పుడు ఎవరైనా వెనక్కి తగ్గారో ఏమైందో కానీ.. ‘బంగార్రాజు’ మాత్రం డేట్ లాక్ చేసుకున్నాడని టాక్.మరి అనుకున్నట్లుగా రిలీజ్ చేస్తారో లేక వెనకడుగు వేస్తారో చూడాలంటున్నారు.  

Latest Videos

నాగచైతన్య జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుంది. ఆమె లుక్ ను కూడా రీసెంట్ గా వదిలారు. 'నాగలక్ష్మి'గా ఆమె లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది.  కథాపరంగా ఈ సినిమాలో 'బంగార్రాజు' వారసుడిగా ఈ సినిమాలో చైతూ కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. లడ్డుండా పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాటను రెడీ చేశారు. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు ఈ రెండో పాట ‘నా కోసం’ టీజర్‌‌తో ‘బంగార్రాజు’ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. నాగ చైతన్య, కృతి శెట్టిలపై రొమాంటిక్ సన్నివేశాలు ఈ పాటలో కనిపించబోతోన్నాయి.

 ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందమైన బాణీని సమకూర్చారు. మొదటిసారిగా నాగ చైతన్య, క‌ృతి శెట్టి జోడిగా కనిపించబోతోన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
 

click me!