అఫీషియల్: సైరా నుంచి తప్పుకున్న రెహమాన్

Published : Nov 26, 2017, 08:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అఫీషియల్: సైరా నుంచి తప్పుకున్న రెహమాన్

సారాంశం

సైరా నరసింహారెడ్డి చిత్రం నుంచి తప్పుకున్న ఎఆర్ రెహమాన్ తన చేతిలో ఫుల్ ప్రాజెక్టులున్నందున సమయం కేటాయించలేనన్న రెహ్మాన్ చిరు సినిమాను మిస్ కావటం బాధాకరమని రెహ్మాన్ వ్యాఖ్య సైరాకు సంగీతం కోసం థమన్ నే ఖరారు చేసినట్లు సమాచారం

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు ప్రపంచం మెచ్చిన మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. రెహ్మాన్-చిరుల కాంబినేషన్‌తో 'సైరా నరసింహా రెడ్డి'పై అభిమానుల్లో అంచనాలు ఇంకొంత రెట్టింపు అయ్యాయి. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం రెహ్మాన్ ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.

 

తన మ్యూజిక్ జర్నీ మొదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన రెహ్మాన్..  ది హిందు డైలీ పత్రికతో మాట్లాడుతూ... తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.



మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు... సైరా నరసింహా రెడ్జి సినిమా కథనం కూడా అంతేగొప్పది. కానీ దురదృష్టవశాత్తుగా ఆ సినిమాకు కంపోజ్ చేసేంత సమయం తన దగ్గర లేదు. తన చేతిలో ఎన్నో ప్రాజెక్ట్స్ వున్నాయి. మొదటిగా అవి పూర్తిచేయాల్సి వుంది. అందువల్లే సైరా నరసింహా రెడ్డి సినిమా చేయలేకపోతున్నాను అని ఆవేదన వ్యక్తంచేశారు ఏఆర్ రెహ్మాన్. 
 


ఇదిలావుంటే, రెహ్మాన్ వీలుకాకపోవడంతో తమ సినిమా కోసం ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి కంపోజర్ ఎస్ఎస్ థమన్‌ని సంప్రదించినట్టు సమాచారం. అంతేకాదు.. రెహ్మాన్ బిజీగా వున్న కారణంగానే అతడి స్థానంలో థమన్ ఓకే అయ్యాడని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు