సెట్స్ కు వెళ్లకుండానే సైరా రికార్డు

Published : Nov 26, 2017, 06:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సెట్స్ కు వెళ్లకుండానే సైరా  రికార్డు

సారాంశం

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి చిత్రం సురెందర్ రెడ్డి దర్శకత్వం, రామ్ చరణ్ నిర్మాత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిసస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డు ప్రైస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిరు 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ లోగోతోనే సంచలనం సృష్టించగా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సైరా చిత్రం రికార్డులు సృష్టిస్తోంది.

 

ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న సైరా మూవీ ఆడియో రైట్స్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఏకంగా 2.90 కోట్ల రూపాయల ఆడియో రైట్స్ ప్రైస్ ఆఫర్ చేశారట. ఆదిత్య, లహరి ఆడియో సంస్థల మధ్య ఈ సైరా ఆడియో ఫైట్ జరుగగా ఫైనల్ గా లహరి మ్యూజిక్ వారు సైరా కోసం 2.90 కోట్ల రూపాయలు వెచ్చించారట. ఆదిత్య సంస్థ 2.50 కోట్ల దాకా వచ్చి ఆగిపోయారట. దీంతో సైరా ఆడియో రైట్స్ లహరి సంస్థ దక్కించుకుందట. మొత్తానికి సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సైరా ఆడియో రైట్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది.

 

ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. అదే నిజమైతే..సైరా సినిమా మెగా అభిమానులకు పండుగ లాంటి సినిమా అవుతుందని చెప్పొచ్చు. అమితాబ్,నయనతార, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితర స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు